గ్లోబల్ సార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ మూవీ మరి కొద్దిరోజుల్లో థియేటర్‌లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక.. తాజాగా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. అమెరికా డల్లాస్‌లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు తో పాటు.. పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరై సందడి చేశాడు.
ఇక సుకుమార్.. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమాను చూశానని.. సినిమా ఎలా ఉందో.. ఆ ఎక్స్పీరియన్స్‌ను అక్కడి ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నాడు. సుకుమార్ మాట్లాడుతూ నేను.. చిరంజీవి గారు కలిసి ఇప్పటికే సినిమా చూసాం. సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హఫ్ అద్భుతంగా ఉందని.. ఇంటర్వెల్ అయితే అదిరిపోయిందంటూ వివరించిన ఆయన.. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడు గూస్బంప్స్ వచ్చేస్తాయని.. క్లైమాక్స్‌లో చరణ్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ చూస్తారంటూ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు.
ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ బట్టి సినిమా అదిరిపోయిందని సమాచారం. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత ఆశక్తి నెలకొంది. ఇక వచ్చేయడాది జనవరి 10న సంక్రాంతి బరిలో దిగనున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో రూపొందింది. ఈ సినిమాల్లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. కాగా కియారా అధ్వాని హీరోయిన్గా.. సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య కీలకపాత్రలో నటించిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.