ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు వివాదం తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రోజు రోజుకు మరింత దుమారంగా మారుతున్న ఈ వివాదంపై.. తాజాగా అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం సాయంత్రం బన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కామెంట్స్ ను ఖండించాడు. ఇదిలా ఉండగా తెలంగాణ డీజీపీ జితేందర్.. ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.
పౌరులందరూ బాధ్యతాయుతంగా ఉండాలంటూ చెప్పుకొచ్చిన ఆయన.. సంధ్య థియేటర్ ఘటనతో పాటు అల్లు అర్జున్‌ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ పర్సనల్ గా మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరుల భద్రత, రక్షణ అన్నిటికంటే మాకు చాలా ముఖ్యం. అది సినిమా హీరో అయినా కావచ్చు, మరెవరైనా కావచ్చు.. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలంటూ వెల్లడించాడు.
ఇలాంటి సంఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదని.. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్స్ ముఖ్యమైన అంశం ఏమీ కాదంటూ చెప్పుకొచ్చిన డీజీపీ జితేందర్.. ఫిర్యాదు మేరకు చర్యలు ఉంటాయంటూ వెల్లడించాడు. ఇక మోహన్ బాబు కేసు గురించి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. నటుడు మోహన్ బాబు, తన కొడుకు మధ్య జరిగిన ఫ్యామిలీ గొడవల క్రమంలో.. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసు పై రియాక్ట్ అవుతూ.. ప్రస్తుతం ఆ కేసు విచారణ నడుస్తోందని.. సరైన చర్యలు తీసుకుంటామంటూ డీజీపీ జితేందర్ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి.