టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ అంతా ఎదురు చూసే స్టేజ్‌కు ఎదిగాడు తారక్. అలాంటి స్టార్ హీరో నుంచి.. నెక్స్ట్ రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్ అంచనాలు ఉంటాయన్నడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ త్వరలోనే పూర్తికానుంది. అయితే తారక్ ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షనట్లో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఇలాంటి క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్‌తో తన సినిమా ప్రారంభించినట్లు వెల్లడించాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా ప్రశాంత్ భారీ సక్సెస్ సాధించాలని.. దాంతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా.. పాన్ ఇండియా లెవెల్‌లో మార్కెట్ మరింతగా పెరగాలని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒకప్పుడు చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర స్టోరీని పోలి ఉంటుంది అంటూ.. పునర్జన్మల నేపథ్యంలో తారక్ సినిమా తెరకెక్కనుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రశాంత్ నీల్ ఇలాంటి ఓ పాయింట్ తీసుకుని తన స్టైల్ మేకింగ్ ఎలా ఉంటుందో ఆడియన్స్ కు చూపించడానికి సిద్ధమవుతున్నాడట. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్‌తో సలార్ సినిమాను చేసి.. సూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌కు అంతకు మించిన సక్సెస్ ఇస్తానంటూ ఫ్యాన్స్ కు మాటే ఇచ్చాడు. మరి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ సినిమాని ఏ రేంజ్ లో తర్కెక్కిస్తాడో వేచి చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం పాన్ని ఇండియాలో టాప్ డైరెక్టర్గా రాణిస్తున్న ప్రశాంత్, తారక్ కాంబోలో వచ్చే సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నీల్.. ఎన్టీఆర్ కి ఎలాంటి ఇమేజ్ను తెచ్చి పెడతాడు.. ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తాడో.. వేచి చూడాలి.