ప్రస్తుతం సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ పై నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. బన్నీ నిర్లక్ష్యం కారణంగానే సంధ్య థియేటర్లో తొక్కిసులాట జరిగి మహిళ ప్రాణాన్ని కోల్పోయిందని.. ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు అంటూ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ఘాటు విమర్శలు చేశాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు మరింత వ్యతిరేకత పెరిగింది. భారీగా ఆయనను వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు.
సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తన థియేటర్ నుంచి వెళ్లిపోయారని.. నిన్న ప్రెస్ మీట్ లో బన్నీ వివరించాడు. అయితే జాతర సీన్ వరకు థియేటర్లోనే ఆయన ఉన్నట్లు ప్రూఫ్లతో సహా నిరసన వీడియోలను పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు.. నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ థియేటర్ నుంచి నేరుగా వెళ్ళిపోకుండా.. రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు చేతులు ఊపుకుంటూ రోడ్ షోలు చేశారంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఆ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోకు మద్దతుగా వీడియోలు షేర్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం వరకు తొక్కిసులాట జరిగి మహిళ చనిపోయిన విషయం తనకు తెలియదని అల్లు అర్జున్ ప్రెస్మీట్లో వెల్లడించాడు. బన్నీ.. అన్ని అబద్ధాలు చెబుతున్నాడు అంటు నెటిజన్లు కామెంట్లు చేయడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ వీడియోని షేర్ చేస్తూ.. రేవతి చనిపోయిన విషయం ఆమె భర్తకే మూడు గంటల వరకు తెలియదు.. అలాంటిది 12 గంటలకు థియేటర్ నుంచి వెళ్లిపోయిన మా అల్లు అర్జున్ అన్నకు ఎలా తెలుస్తుంది అంటూ.. రేవతి భర్త ఓ ఛానల్ తో మాట్లాడిన కామెంట్స్ వీడియో వైరల్ చేస్తున్నారు.
BIG Twist 🤯🤯
3 AM Varaki Husband Ki Thana Wife Chanipoyindhi Ani Telidhu, 12 Clock Ki Theatre Nundi Intiki Vellina #AlluArjun Ki Ela Telusthadhi 🤔🤯🤯pic.twitter.com/QhCpT78M1r
— Filmy Bowl (@FilmyBowl) December 21, 2024