సంధ్య థియేటర్ వివాదంలో రోజు రోజుకు మరింత దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బన్నీ పై ఘాటు కామెంట్స్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. నిన్న రాత్రి ప్రెస్ మీట్‌లో తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని.. తన క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేందుకు చూస్తున్నారంటూ వెళ్ళడించాడు. అయితే.. ఈ ఇష్యూ పై కొందరు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరి కొందరు రేవంత్ వ్యాఖ్యలను వెనకేసుకొస్తున్నారు.
ఈ క్రమంలో ఓ సినీ క్రిటిక్ ఆరోజు తొక్కిసులాట సమయంలో అల్లు అర్జున్ ఏం చేశాడో క్లియర్ గా చెప్పుకొచ్చాడు. తొక్కిసులాటలో మహిళా చనిపోయింది.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మేము కాపాడలేమని పోలీసులు వెల్లడించారని.. ఈ పాట అయిపోగానే వెళతా, ఈ ఫీట్ అయిపోగానే వెళతా, నేను ఇలా మధ్యలో వెళ్తే నా సినిమా బాలేదని నేనే వెళ్లాలనుకుంటారు అంటూ అల్లు అర్జున్ బాధిత రహిత్యమైన సమాధానాలు చెప్పాడని..
ఆ రోజు ఏసిపి.. అల్లు అర్జున్‌ను అడిగిన ఒక్క ప్రశ్న.. అతని జీవితాంతం వెంటాడుతుందంటూ ఆ క్రెటిక్ చెప్పుకొచ్చాడు. ఏం చదువుకున్నావ్.. నీకు కామన్ సెన్స్ ఉందా.. చెప్తుంటే అర్థం కాదా.. అవతల ఓ మనిషి చనిపోయిందని చెప్తుంటే.. నా సినిమా, నా పాట అంటావ్ అని ఎసిపి.. అల్లు అర్జున్ పై కోపడ్డాడని.. ఇది అతనికి జీవితాంతం గుర్తుండిపోతుందంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది.
ఇది కనుక నిజమైతే…?
ఇంట్లో మనిషివని రేపొద్దున @KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan క్షమించినా
సమాజం మటుకు నిన్ను క్షమించదు … ఛీ @alluarjun pic.twitter.com/zU1k9j3KIO
— Onion Slice🧢 (@pepper__spray) December 21, 2024