ఆ ఫ్లాప్ మూవీ గురించి గర్వంగా చెప్పుకునే ప్రభాస్.. అందుకు కారణం డైరెక్టరే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది కల్కి సినిమాతో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. మరిన్ని పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం.. ప్రభాస్ కెరీర్‌.. బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అనే రేంజ్ లో కొనసాగుతుంది. ఇక బహుబ‌లి తర్వాత హిట్‌లు, ప్లాపులతో సంబంధం లేకుండా నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్.. తన సినీ కెరీర్‌లో కొన్ని సినిమాల విషయంలో చాలా గర్వంగా మాట్లాడుతుంటాడు.

Prime Video: Bujjigadu

హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయన గర్వంగా చెప్పుకునే సినిమాల్లో కెరీర్‌ను మలుపు తిప్పిన వర్షం సినిమా ఒకటైతే.. పాన్‌ ఇండియా లెవెల్లో ప్రభాస్కు ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా బాహుబలి కూడా ఒకటి. కానీ.. ప్రభాస్ ఓ ఫ్లాప్ సినిమా గురించి కూడా ఎప్పటికప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. అదే బుజ్జిగాడు. కమర్షియల్‌గా బుజ్జి గాడు పెద్ద సక్సెస్ అందుకోలేదు. కానీ.. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేష‌న్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

క్రేజీ పాత్రలో నటించి మెప్పించిన ప్రభాస్.. అభిమానులు కోరుకునే ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ఇక ఓ ఈవెంట్‌లో ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమాలు బుజ్జిగాడు ఒకటంటూ వెల్లడించాడు. ఈ మూవీ అంటే నాకు చాలా ఇష్టమని.. కేవలం హీరో క్యారెక్టర్జేషన్ పై కథ‌ రాయగల డైరెక్టర్ ఎవరన్నా ఉన్నాడంటే అది పూరి జగన్నాథ్ మాత్రమే అంటూ కామెంట్లు చేశాడు. తన వంద రోజులు తీసే సన్నివేశాన్ని కూడా.. పూరి జగన్నాథ్ ఒక్క డైలాగ్ తో హైలెట్ చేయగలరని స్వయంగా రాజమౌళి చెప్పిన విషయాన్ని ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.