టాలీవుడ్ లో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నాలుగున్నర దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో సినిమాల్లో రాణిస్తున్న మెగాస్టార్.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తన ఫిట్నెస్, యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్.
ఇంతకీ.. మెగాస్టార్‌కు మాత్రమే సొంతమైన రికార్డుల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. 1978లో పునాది రాళ్లు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. 1987లో ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని స్టార్ హీరో ఇమేజ్ను దక్కించుకున్నాడు. అప్పటినుంచి అంచలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని ఇమేజ్‌క్రియేట్ చేసుకున్న చిరు సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ నటుడిగా రికార్డ్ సృష్టించాడు.
1992లో ఒక్క సినిమాకు కోటి రూపాయలు అందుకున్నాడు. అంతేకాదు మొత్తం సినీ ఇండస్ట్రీలోనే పర్సనల్ వెబ్సైట్ కలిగిన ఏకైక హీరో కూడా చిరంజీవినే. ఈయన పేరుపై ఓ వెబ్సైట్ ఉంది. ఇక ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చిరంజీవి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక రష్యన్‌లోకి డబ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా కూడా చిరంజీవిది కావడం విశేషం. ఆయన నటించిన స్వయంకృషి సినిమా అక్కడ డబ్ అయ్యి మంచి సక్సస్ అందుకుంది. ఇక.. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకల్లో గెస్ట్ గా పాల్గొనే ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ హీరో కూడా చిరంజీవినే కావడం విశేషం.