ఆ హీరో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న వారిలో దిల్‌రాజు మొదటి వరుసలో ఉంటాడు. ఓ డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈయన.. నిర్మాతగా మారి తను నిర్మించిన దాదాపు అన్ని సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను ప్రోడ్యూస్‌చేసే స్థాయికి ఎదిగిన‌ దిల్‌రాజు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ స్టార్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరో జ‌గ‌ప‌తి బాబు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Jagapathi Babu | జ‌గ‌ప‌తిబాబు ఆ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదు : దిల్ రాజు-Namasthe Telangana

దిల్ రోజు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ నటించిన ఆకాశమంత సినిమా తమిళ్లో చూసి దానిని నేను కూడా తెలుగులో డబ్ చేయాలనుకున్నా. తమిళ్లో రిలీజ్ కంటే ముందే దాన్ని తెలుగు వర్షన్ రైట్స్ నేను తీసేసుకున్నా. తెలుగులో రిలీజ్ చేద్దామని అనుకున్నా. నాకు సినిమా బాగా నచ్చింది. తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత జగపతిబాబు గారిని కలిసి ఇలా ఆ సినిమా చేయాలనుకుంటున్నా.. మీరు చేస్తారా సార్ అని అడిగా.. జగపతిబాబు గారు వెంటనే సినిమా చూశారు. తర్వాత నన్ను పిలిపించి మూవీ చాలా బాగుంది.. చేద్దామన్నారు. ఇక ఆయన సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో ఎంతో సంతోషించా అంటూ వివ‌రించాడు.

Dil Raju: ఆ స్టార్ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. నా కళ్లలో నీళ్లు వచ్చాయి.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ - Telugu News | Star producer dil raju emotional Comments about ...

ఇక‌ ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వమంటారని అడగగా.. వెంటనే జగపతిబాబు రుమ్యున‌రేష‌న్‌ ఒక్క రూపాయి కూడా వద్దని అన్నారు. ఆ మాట వినగానే ఒక్కసారిగా నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. జగపతిబాబు లాంటి స్టార్ హీరోలు నా సినిమాలో నటించడానికి ఒప్పుకోవడమే గ్రేట్. అలాంటిది రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తానని చెప్పడం సాధారణ విషయం కాదు అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి నాకు జగపతిబాబు గారి దగ్గర రుణం ఉండిపోయిందని వివ‌రించాడు. మనం డబ్బులు, పేరు కాదు.. మనుషుల్ని సంపాదించుకోవాలంటూ దిల్‌రాజు కామెంట్ చేసాడు. ఈ షోలో దిల్‌రాజు కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి.