విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఒక్కో టీచర్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. తమ విధ్యర్ధలకు చెప్పే కంటెంట్ అర్ధం అండం కోసం ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది టీచర్స్ మాత్రం ఇంకాస్త డిఫరెంట్ గా ఆలోచించి తమ విద్యార్థులకు ఎలాగైనా చెప్పే పాటలు బురకెక్కాలని కొత్త కొత్త స్టైల్స్ తో టీచ్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా ఓ టీచర్ పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు చెప్పడానికి ఏకంగా సీనియర్ స్టార్ హీరో బాలయ్య పాటనే ఎగ్జాంపుల్ గా తీసుకుంది.
అఖండ సినిమాలో జై బాలయ్య పాటలోని బాలకృష్ణ స్టెప్పులను ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ ఫిజిక్స్ ఫార్ములా ను స్టూడెంట్స్‌కు వివరించింది. దీంతో బాడీ మూవింగ్ విత్ కాంటెస్ట్ వెలాసిటీ విత్ వేరియబుల్ మాస్.. ఫార్ములాను అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసింది. టీచర్ చెప్పిన ఫిజిక్స్ పాఠంలో అంశం కూడా ఇదే. ఫార్ములా.. పాటలో బాలయ్య వేసుకొన్న షర్ట్ ఒకదాని తర్వాత ఒకటి మారిపోతున్నాయి. బాలయ్య బాబు మాస్ తగ్గిపోతుంది. కానీ.. కాన్స్టంట్ వెలాసిటీ తో స్టెప్పులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఇక్కడ బాడీ మూవింగ్ విత్ కాంటెస్ట్ వెలాసిటీ.. విత్ వేరియబుల్ మాస్.. ఫార్ములాను అంటూ చెప్పుకొచ్చింది. f = v(dm/dt) అంటూ ఫిజిక్స్ ఫార్ములా ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఫార్ములాను టీచ్ చేసిన కాన్సెప్ట్ బాలయ్య ఫ్యాన్స్ నెటింట తెగ వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. బాలయ్య సినిమాపై నెగటివ్గా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకు.. ఫైట్స్ ఫిజిక్స్ లేదని చేసే చెత్త కామెంట్స్ కు మంచి గుణపాఠంగా ఈ వీడియోను వర్ణిస్తున్నారు. ఫిజిక్స్ క్లాసుల్లో ఆయన స్టెప్లే రిఫరెన్స్ గా పెట్టుకునేలా చేసి చూపించాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సామెత ఉంది.అధి బాలయ్య ప్రూవ్ చేసి చూపించాడు.బాలయ్య సినిమాల్లో కొన్ని దర్శకులు చేసిన కొన్ని ఫైట్స్ లో ఫిజిక్స్ లేదు అని కుక్కలా మొరిగిన వాళ్లకి అదే ఫిజిక్స్ క్లాసుల్లో తన స్టెప్ రెఫరెన్స్ పెట్టుకునేలా చేసి.చెప్పు తో కొట్టాడు #NandamuriBalakrishna pic.twitter.com/nEPchCpAma
— Sailendra Medarametla (@sailendramedar2) November 6, 2024