గోల్డెన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న సమంత.. చేతికున్న స్నేక్ వాచ్ కాస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. బాలీవుడ్‌లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మయోసైటిస్‌తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాల్లో నటించకపోయినా.. బాలీవుడ్ సెటాడెల్.. హ‌నీబ‌నీ సిరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే అమ్మడు ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో తెగ సందడి చేసింది.

ఇక నవంబర్ 8న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తెగ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమంత.. ప్రస్తుతం ముంబైలో సందడి చేస్తుంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ షేర్ చేసుకుంటున్నా ఉంటుంది. అలా తాజాగా తన ముంబైలో ప్రదర్శించిన సెటాడెల్‌ ప్రీమియర్ షో వేడుకల్లో మెటాలిక్ గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించి సందడి చేసింది.

ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన‌ సమంత.. ఆ ఈవెంట్లో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇక ఈ మెటాలిక్ గోల్డెన్ డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా.. స్నేక్ వాచ్, సింపుల్ ఇయర్ రింగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం సమంత తన చేతికి పెట్టుకున్న స్నేక్ వాచ్ హాట్ టాపిక్ గా మారింది. ఆడియన్స్‌ను ఆ వాచ్ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఈ క్ర‌మంలో ధర తెలుసుకున్న ప్రేక్షకులు నోరెళ్ళబెడుతున్నారు. ఇంతకీ ఆ వాచ్ కాస్ట్‌ చెప్పలేదు కదా.. దాని విలువ‌ అక్షరాల రూ.20 లక్షల అట. డివియల్ గారి సంస్థకు చెందిన సర్ఫ్ ఏంటి టు గోగాస్ బ్రాండెడ్ వాచ్ అని తెలుస్తుంది. అయితే చూడడానికి ఇంత సింపుల్గా కనిపిస్తున్న ఆ వాచ్ ఏకంగా రూ.20 లక్షలు అని తెలియడంతో నెటిజన్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.