డైరెక్టర్ పై కోపంతో షూటింగ్ నుంచి తారక్ అవుట్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లతో లక్షల మంది అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్ కూడా అలవోకగా వేసే తారక్.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌తో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఎన్టీఆర్ డ్యాన్స్ చేసేస్తారు అంటూ జాన్వి కపూర్ కూడా ఓ ఈవెంట్లో వెల్లడించింది. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్రేస్ అమాంతం పరిగిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు.

పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ పేరు ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న తారక్.. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. మొదట కాస్త నెగటివ్ టాక్ వచ్చిన.. తర్వాత సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్న దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి సత్తా చాటుకుంది. ఇదిలా ఉంటే.. తారక్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది. ఓ సినిమా విషయంలో డైరెక్టర్ కోపంతో ఎన్టీఆర్ షూటింగ్ నుంచి వెళ్లిపోయారని.. తను సినిమాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్‌కు అంతగా కోపం తెచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు ఆ సినిమా ఏంటో ఒకసారి చూద్దాం.

Bala Ramayanam Telugu Full Length Movie | Telugu Movies | Mana Chitralu

ఆ డైరెక్టర్ మరెవరో కాదు గుణశేఖర్. తారక్ తన బాల్యంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాల రామాయణం సినిమాతో ఆడియన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమాలో రాముడిగా నటించాడు తారక్. ఇక చిన్నప్పటి నుంచి హైపర్ ఆక్టివ్ గా ఉండే తారక్.. అందరికంటే ఎక్కువగా అల్లరి చేసేవాడట. తోటి పిల్లలతో కలిసి షూటింగ్ కు తెచ్చిన వస్తువులన్నీ పాడుచేస్తూ ఉండేవాడట. దీంతో ఓ సారీ కోపం వచ్చిన గుణశేఖర్.. ఎన్టీఆర్ పై గట్టిగా అరిచాడట. వెంటనే ఎన్టీఆర్ అలిగి సెట్స్ నుంచి వెళ్ళిపోయాడట. తర్వాత విషయం తెలుసుకున్న గుణశేఖర్ ఆయన దగ్గరకు వెళ్లి బుజ్జగించి తిరిగి సినిమాను కొనసాగించారట. ఈ విషయాలన్నీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ చెప్పుకు రావడం విశేషం. ఇక ఈ సినిమా అప్ప‌ట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.