అనుష్క పవర్ఫుల్ కం బ్యాక్.. ఘాటీ గ్లింప్స్..

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో న‌టించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన క్యూట్‌నెస్, క్యూట్ స్మైల్, నటన, అందచందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది. కాగా అనుష్క చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరిగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి ఆకట్టుకున్న అనుష్క.. తర్వాత మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించలేదు. ఇక అనుష్క ప్రస్తుతం ఘాటీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Anushka Shetty Upcoming Movie Ghaati First Look Poster

ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా.. ఘాటి మేకర్స్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన మేకర్స్‌ ఊహించని విధంగా ప‌వ‌ర్‌ఫుల్ ఇంటెన్స్‌ లుక్‌తో అందరిని సర్ప్రైజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజై ప్రేక్షకులను భయపెట్టేస్తున్నాయి. తాజాగా ఈ వీడియో గ్లింప్స్ కట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అనుష్క శెట్టి మరోసారి తన యాక్టింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనేలా త‌న లుక్‌తో ఆకట్టుకుంది.

ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం తన యాక్షన్ తోనే ఆడియన్స్ను భయపెట్టేసింది. ఇక ఈ సినిమాలో స్వీటీ ఓ ర‌గ‌డ్ పాత్ర‌లో పల్లెటూరి పడుచుల కనిపించనుందని లుక్స్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అంతేకాదు అనుష్క ఓ వ్యక్తి పీక కోసి చంపుతున్న సీన్ అంద‌రిని భ‌య‌పెడుతుంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మరోసారి తన మార్క్‌ చూపించనున్నాడు. ఈ సినిమా నాగవల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఘాటి ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ మూవీతో అనుష్క పవర్ఫుల్ కం బ్యాక్ ఖాయం అంటూ ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.