టాలీవుడ్ సీనియర్ హీరోగా జగపతిబాబు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మెల్లమెల్లగా హీరో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు.. మళ్లీ రీ ఎంట్రీలో విలన్ పాత్రలలో ఛాన్స్‌లు దక్కించుకుంటూ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు. బాలయ్య లెజెండ్ సినిమాలో విలన్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించి ఆడియన్స్‌ను భయపెట్టిన జగపతి బాబు.. ఈ మూవీతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆడియన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో వరుస విలన్ పాత్రలో అవకాశాలు వచ్చాయి. అలా ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషలను విలన్ పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు. సినిమాలు పరంగా జగపతిబాబు ఎంత బిజీ బిజీ లైఫ్‌లీడ్ చేస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తాడు. తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.
ఈ క్రమంలోని అప్పుడప్పుడు జగపతిబాబు చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు షేర్ చేసుకున్న జగపతిబాబు.. అందరికీ షాక్ ఇచ్చాడు. ఎంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలను వీడియోగా మార్చి ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఈ ఫోటోలలో బాగున్నానని అందరూ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయి ఒళ్ళు బలిసి వీడియోలా ఎడిట్ చేసి షేర్ చేశా.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన కామెంట్స్‌తో పాటు పోస్ట్ కూడా నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది.
View this post on Instagram