మెగా డాటర్ నిహారికకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు టీవీ షోలతో హోస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వెండి తెరపై పలు సినిమాల్లో హీరోయిన్‌గాను అవకాశాలు దక్కించుకొని నటించింది. అయితే సరైన బ్రేక్ దొరకకపోవడంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న నిహారిక.. కొంతకాలానికే అతనికి విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఇది మెగా ఫాన్స్ కు బిగ్ షాక్ అనిపించింది. ఈ క్రమంలోనే ఎన్నో నెగటివ్ ట్రోల్స్ ను ఎదుర్కొంది. ఈ విడాకులు నిహారికదే తప్పంటూ సోషల్ మీడియాలో ఎన్నో వాదనలు కూడా వినిపించాయి.
తనపై వస్తున్న నెగటివ్ ట్రోల్స్ కు.. చెడు ప్రచారానికి నిహారిక కూడా ఎప్పుడు పెద్దగా స్పందించలేదు. కాగా గతంలో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మాట్లాడుతూ దానిపై క్లారిటీ ఇచ్చింది. పెళ్లయిన ఏడాదికి విడాకులు తీసుకుంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు. దెబ్బ తగిలిన వాళ్లకే ఆ బాధ ఏంటో తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి, విడాకులు ఇవి సులువైన విషయాలు కాదు. నా కెరీర్ గురించి ఆలోచించి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నిహారికకు క్లోజ్ ఫ్రెండ్ అంటూ సమాచారం. అయితే ఈ వార్తలు నిజం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతున్న ఈ వార్తలకు నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చైతన్య నిహారికకు భలే దెబ్బ కొట్టాడుగా అంటూ.. నిహారికా ఫ్రెండ్నే పెళ్ళి చేసుకుని రివెంజ్ తార్చుకుంటున్నాడుగా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిహారిక విషయానికి వస్తే తను తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటానని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈమె నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక మరో పక్కన మంచు మనోజ్ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. మనోజ్ నటించిన వాట్ ది ఫిష్ సినిమాలో నిహారిక ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు పలు షోలకు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తూ సందడిచేస్తుంది.