టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రస్తుతం మూల స్తంభాలుగా మెగాస్టార్, బాలయ్య, నాగ్, వెంకీలు నిలబడ్డారు. అయితే వీరి ముందు జనరేషన్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తెలుగు సినిమాఖ్యాతిని పెంచేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఒక్క సినిమా కోసం హీరోలు ఏడాదిన్నర కష్టపడుతుంటే.. అప్పట్లో స్టార్ హీరోస్ ఒకరిని మించి ఒకరు ఏడాదికి పదికి పైగా సినిమాలను తరికెక్కిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకునేవారు. తమ సినిమాలతో గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. ఇక మొదట ఇండస్ట్రీని ఏలిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్ద హీరోలను ఢీకొట్టేందుకు యంగ్ హీరోలుగా శోభన్ బాబు, కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
అలా ఇండస్ట్రీలోకి యంగ్ హీరో గా అడుగుపెట్టిన కృష్ణ.. తన సినీ కెరీర్‌లో ఎన్నో సంచలన విజయాలను దక్కించుకొని సూపర్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. నటనపై ఆసక్తితో 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ తన సినీ కెరీర్లో 350 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం హీరో గానే కాదు.. నిర్మాతగా, దర్శకుడుగాను తన ప్రతిభను చాటుకున్న కృష్ణ.. ఒకే ఏడాదిలో 18 సినిమాలను రిలీజ్ చేసి హిట్లు అందుకొని రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఇక సూపర్ స్టార్ ఒకానొక సమయంలో అన్నగారు రిజెక్ట్ చేసిన కథలో నటించి రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఆ సినిమా మరేదో కాదు అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా అప్పట్లో ఎంత ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసిందో.. ఎన్ని రికార్డు తిరగరాసిందో తెలిసిందే. రామచంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఈ సినిమాను మొదట డైరెక్టర్ రామచందర్రావు.. ఎన్టీఆర్ తో తీయాలని అనుకున్నారట. ఆయనకు కథ కూడా వినిపించాడట. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఈ కథను కృష్ణ దగ్గరకు తీసుకువెళ్లారు. ఇక కృష్ణకు కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా కృష్ణ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది.