చిరు – శంకర్ కాంబోలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ అయ్యాయని తెలుసా.. అవేంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఎంచుకునే కంటెంట్ కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోస్ విన్న కథలన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. కొన్ని క‌థ‌ల‌ను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంతేకాదు మరికొన్ని సందర్భాల్లో డేట్స్ అడ్జస్ట్‌కాక‌ లేదా మరి ఏదైనా పర్సనల్ కారణంగా సినిమాలను రిజెక్ట్ చేసిన సంఘటన కూడా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. అలా వాళ్ళు రిజెక్ట్ చేసిన క‌థ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో ఇలా మెగాస్టార్ చిరంజీవి.. టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రెండు కథలను విన్నారట. రెండు సినిమాలకు ఆల్మోస్ట్ ఓకే అనుకున్న తర్వాత.. ఏవో కారణాలతో లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయాయట.

Gentleman | Watch Full Movie Online | Eros Now

ఇంతకీ ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం. మొదటి శంకర్.. చిరుతో తెర‌కెక్కించాలనుకున్న మూవీ జెంటిల్మెన్. అర్జున్ సర్జ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా అప్పట్లో హిస్టరీ క్రియేట్ చేసింది. నిజానికి ఈ సినిమాలను మొదట చిరంజీవితో తీయాలని శంకర్ భావించారట. కానీ.. కారణం తెలియదు చిరంజీవి కథను రిజెక్ట్ చేశాడు. దీంతో అర్జున్ స‌ర్జ‌కు కథ వినిపించిన శంకర్.. ఆయనతో సినిమా తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక చిరంజీవితో శంకర్ తర్కెక్కించాలనుకున్న మరో మూవీ ఒకే ఒక్కడు. ఈ సినిమాను తమిళ్లో అర్జున్‌తో.. తెలుగులో చిరంజీవితో రూపొందించి రిలీజ్ చేయాలని శంకర్ భావించాడట.

ఒకే ఒక్కడు - వికీపీడియా

అయితే అప్పటికే వేరే సినిమాలతో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు. ఇది నిజంగా చిరు బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఈ సినిమాను రిజెక్ట్ చేసి చిరంజీవి అప్పట్లో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో వీళ్ళ కాంబోలో రావాల్సిన రెండు సినిమాలు కూడ మిస్ అయిపోయాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ అర్జున్ సర్జ‌ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ లో అందుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ‌ర‌తో ఆడిచ‌న్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే శంకర్.. చిరు తనయుడు రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజ‌ర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది.