మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లోనే కాదు నార్త్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమన్నా టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. యంగ్ హీరోల నుంచి.. సీనియర్ హీరో చిరంజీవి లాంటి వారి సరసన కూడా నటించి ఆకట్టుకున్న తమన్నా.. అతితక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. శేఖర్ కమ్ములా డైరెక్షన్‌లో తెరకెక్కిన హ్యాపీ డేస్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి.
తమిళ్ హీరో కార్తీ నటించిన ఆవారాతో యూత్ క్రష్ గా మారిపోయింది. అప్పటినుంచి తెలుగు, తమిళ్‌లో వరస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన తమన్న.. తర్వాత బాలీవుడ్ పై కన్నేసింది. ఈ క్రమంలో సౌత్ సినిమాలకు దూరమైన ఈ మిల్కీ బ్యూటీ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిస్తుంది. త్వరలోనే విజేయ్, తమన్న పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్రమంలో తమన్నా ఫస్ట్ క్రష్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే రెండుసార్లు లవ్ బ్రేకప్ అయిందని.. ఆ రిలేషన్స్ వర్కౌట్ కాలేదంటే చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం విజయ్ తో ప్రేమలో ఉన్న తమన్న.. గతంలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకుంటూ స్కూల్ డేస్ లో ఉండగా ఓ అబ్బాయిని చాలా ప్రేమించానని.. ఇష్టపడ్డానని వెల్లడించింది. తమన్న తన ఫ్రెండ్ అన్న నే లవ్ చేసిందట. అదే విషయాన్ని ఆ అబ్బాయికి చెప్తే.. తమన్నా తన చెల్లి ఫ్రెండ్ కావడంతో.. తనను కూడా చెలిలాగే భావించేవాడట. నువ్వు నా చెల్లి లాంటి దానివని తమన్నతోనే చెప్పాడట. దీంతో తమన్నకు దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయితే ఈ ఫస్ట్ లో తన ఫిఫ్త్ క్లాస్ లో జరిగిందని తమన్నా వివరించింది.