సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మల్టీ స్టారర్ ట్రెండ్ తెగ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జనరేషన్‌లో మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. అయితే క్రమక్రమంగా మల్టిస్టారర్ సినిమాల ట్రెండ్ తగ్గినా.. ఇటీవల మల్టీ స్టారర్ ట్రెండ్ మరోసారి మొదలైంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటికే అలా ఎన్నో మల్టీ స్టారర్‌లు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
వాటిని పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు క్రియేట్ చేసిన ఆర్‌ఆర్ఆర్ సినిమానే నిదర్శనం. ఇక ఇలాంటి మల్టీస్టారర్ కాంబోలో ఎన్నోసార్లు ప్లాప్ అవుతుంటాయి. అలా గతంలో తారక్, నాగార్జున తో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉండగా.. తన క్యారెక్టరైజేషన్ నచ్చలేదని ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. ఊపిరి. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా కార్తీ సెకండ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్స్ అందుకుంది. తమన్నా, శ్రేయ హీరోయిన్గా నటించిన ఒప్పించారు.
ఇక అనుష్క కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది. కాగా ఈ సినిమాలో మొదట కార్తీ ప్లేస్ లో ఎన్టీఆర్‌ను అనుకున్నాడట డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎన్టీఆర్‌కు క్యారెక్టర్ నచ్చకపోవడంతో.. ఆయన సినిమాను రిజెక్ట్ చేసాడని టాక్. తర్వాత ఈ పాత్ర కోసం ఎంతోమంది హీరోలను అప్రోచ్ అయినా వంశీ.. చివరకు కార్తిని ఫిక్స్ అయ్యాడు. ఇక సినిమాలో కార్తీ నటనకు ఎంతోమంది ప్రశంసలు దక్కాయి. తన పాత్రలో జీవించేసాడు కార్తీ. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున, కార్తీ మధ్యన బాండ్ మరింత బలపడిందని.. ఇప్పటికి వారు మంచి బ్రదర్స్ లా ఉంటున్నారట.