సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతోమంది మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌ఫుల్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే వాళ్లలో మెగాస్టార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చి.. గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. తనదైన స్టైల్ లో సినిమాలు నటిస్తూ వరుస సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న చరణ్.. తన సినిమాలో హీరోయిన్ల విషయంలో ఎప్పుడు పెద్దగా ఇన్వాల్వ్ అవరట.
అసలు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరట. అలాంటిది ఒకసారి హీరోయిన్ విషయంలో మాత్రం ఆయన చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారని.. ఆ హీరోయిన్ సినిమాలో నటిస్తే నేను సినిమా నుంచి తప్పుకుంటానని తెగేసి చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆమెపై ఎందుకు అంత కోపమో తెలియదు గాని.. చరణ్ సెట్స్ నుంచి ఫైర్ అయ్యి వెళ్లిపోవడంతో.. చేసేదేమీ లేక డైరెక్టర్ ఆ హీరోయిన్ ని తప్పించి తన ప్లేసులో అమలాపాల్‌ను తీసుకొని నటింప చేశారట.
ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు నాయక్. కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాల్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న చరణ్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు.