అనుష్క మూవీ సెట్ లో సందడి చేసిన ప్రభాస్.. అక్కడేం పని డార్లింగ్..

టాలీవుడ్ ఆన్ స్క్రీన్ క్రేజీ కపుల్‌గా పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సౌత్‌ స్టార్ బ్యూటీ అనుష్క ఎలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకు లక్షలాదిమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇక గతంలో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత ఇప్పటివరకు ప్రభాస్, అనుష్క కాంబోలో మరో సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ ఉంది. ఈ క్రమంలోనే అన్‌ స్క్రీన్ జోడి మరోసారి స్క్రీన్ పై మెరిస్తే బాగుండని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tollywood : అనుష్క 'ఘాటీ'.. ఫస్ట్ లుక్ విడుదల | Anushka Shetty First Look from Ghati Released

ఇలాంటి క్రమంలో తాజాగా ఫిలిం సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం అనుష్క.. ఘాటి సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ఘాటీ సెట్లో సందడి చేశారని టాక్. భాగమతి తర్వాత అనుష్క సినిమా సెట్స్ కి ప్రభాస్ రావడం ఇది రెండోసారి.. అయితే ప్రభాస్ నిజంగా సెట్స్ కు వెళ్లాడా.. లేదంటే పుకార్లా.. లేదా అనుష్క ఘాటీ సినిమాలో ప్రభాస్ కూడా ఓ రోల్ లో నటిస్తున్నాడా.. అసలు డార్లింగ్‌కు అక్క‌డ ఏం ప‌ని.. అస‌లు వీటిల్లో వాస్తవం ఏంటో తెలియాల్సి ఉంది. కాని.. మరోసారి ఈ జంట‌జత కడితే బాగుండని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న క్రమంలో వీళ్ళిద్దరికీ పెళ్ళై, పిల్లలు కూడా ఉన్నట్లు ఏఐ ఇమేజెస్ ని క్రియేట్ చేసి తెగ మురిసిపోయారు అభిమానులు.

Prabhas and Anushka Shetty's VIRAL wedding photos break the Internet: The real story behind it | PINKVILLA

మేమిద్దరం స్నేహితులమే అంటూ ఎన్నోసార్లు ప్రభాస్ – అనుష్క చెప్పిన వారి మాటలను లెక్కచేయకుండా.. ఇప్పటికీ అవే వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఘాటి సినిమాలు పొందుతున్న సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి బర్త్డే సందర్భంగా ఇటీవల అఫీషియల్ గా దీనిని అనౌన్స్ చేశారు. రమ్యకృష్ణ, జగపతిబాబు సినిమాల్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ప్రభాస్ రీసెంట్గా హంబాలీ ఫిలిం మేకర్స్ కు 3 సినిమాలతో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2026, 2027, 2028లో బ్యానర్లో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు రానున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. అందులో సలార్ 2 ఒక‌టి కాగా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగ‌రాజన్‌ల‌తో మరో రెండు సినిమాలు ఉండనున్నాయని సమాచారం. ఇక ప్ర‌భాస్ వాటితో పాటు మ‌రో మూడు సినిమాల లైన‌ప్‌తో బిజీగా గ‌డుపురున్నాడు.