టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో గతంలో తెరకెక్కిన పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2ను రూపొందిస్తున్నాడు. దాదాపు 1000 రోజుల సుదీర్ఘకాలంలో ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నా.. ఇంకా మేకర్స్‌కు ఈ టైం సరిపోలేదు. పుష్ప రిలీజ్‌కు ఎలాంటి హడావిడి, టెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అదే జరుగుతుంది. సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇంకా దాదాపు నెలరోజులు మాత్రమే ఉంది. అయితే ఇప్పటికి షూటింగ్ నడుస్తూనే ఉంది. ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారని ఈ వారాంతానికి ముగుస్తుందని సమాచారం.
అది ఎడిట్ చేయాలి, ఫైనల్ రన్ టైం ఫిక్స్ చేయాలి, దానికి మరింత సమయం పడుతుంది. ఇప్పుడైతే పుష్ప 2 ఫస్ట్ హాఫ్ లాక్ అయిందని.. రీ రికార్డింగ్ వర్క్ అని పూర్తయి అని అఫీషియల్ గా తెలుస్తుంది. మరి సెకండ్ హాఫ్ సంగతి ఏంటి.. అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన వెంటనే మొదటి వినిపించిన సమస్య సీజీ వర్క్ సరిగ్గా లేదని. నిర్మాణ విలువలు, క్వాలిటీ క్లియర్గా తెలుస్తుందని.. ఎర్రచందనపు చెక్కల్లో నేచురాలిటీ కనిపించలేదని ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అది నిజమైనని తెలిసినా మేకర్స్ ఏం చేయలేని పరిస్థితి. ఇక దీని తర్వాత వచ్చిన మరో విమర్శ.. రీ రికార్డింగ్ పార్ట్ 1లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై అక్కడక్కడ విమర్శలు వచ్చాయి.
ఆఖరి నిమిషంలో వర్క్ కారణంగానే ఈ లోపాలు కూడా కనిపించాయట. పుష్ప 2 రీ రికార్డింగ్‌కు సంబంధించి కూడా దేవిశ్రీ ఇలాంటి తప్పులే చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడేమో ఆర్ఆర్ కోసం ముగ్గురు సంగీత దర్శకుల్ని తీసుకువచ్చారట. మరి ఈ క్వాలిటీ ఎలా ఉంటుందో.. సింక్ మిస్ అవ్వకుండా కోఆర్డినేట్ చేస్తారో లేదో.. వెయ్యి రోజుల పైన సినిమాకు దీర్ఘకాల సమయం తీసుకున్న మళ్లీ పుష్ప 1 లో జరిగిన తప్పులే పార్ట్ 2 లో కూడా రిపీట్ అవుతున్నాయా.. అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంటున్న సుకుమార్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నెల 17న పాట్నాల్లో జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కూడా సుకుమార్ వస్తాడో.. లేదో డౌటే.