ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అలా మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు మించిన తమ్ముడుగా పవర్ స్టార్ ఇమేజ్‌తో.. ఏపీ డిప్యూటీ సీఎంగానూ దూసుకుపోతున్నాడు. ఇక చిరంజీవి నట వారసుడు.. రామ్ చరణ్ కూడా తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
కాగా ఇప్పటి వరకు ఈ ముగ్గురు మెగా హీరోలతో కలిసి ఒకే ఒక్క హీరోయిన్ నటంచిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనే ఆశక్తి అభిమానులలో కచ్చితంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్.. తండ్రి, కొడుకులతో కలిసి నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా తమకంటే ఏజ్ పెద్ద హీరోలతోనూ ఇప్పుడు ముద్దుగుమ్మలు చిందువేస్తున్నారు. కాగా ఇప్పటివరకు చిరు, రామ్ చరణ్, పవన్‌తో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన కాజల్.. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కాజల్ ఈ ముగ్గురు మెగా హీరోల సరసన చిందేసి బ్లాక్ బస్టర్లు ఇచ్చింది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లోను ఆకట్టుకుంది. చరణ్ తో బ్లాక్ బస్టర్ మగధీర లో నటించింది. అలాగే నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడే సినిమాల్లోనూ చిందేసింది. ఇలా ముగ్గురు మెగా హీరోలతో నటించి మెప్పించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కాజల్ రికార్డ్ క్రియేట్ చేసింది.