టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా సీక్వెల్ పుష్ప 2. ఈ సినిమా కోసం మోస్ట్ అవైటెడ్ గా సినీ అభిమానులతో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ మరోసారి తన మార్క్ చూపించడం ఖాయమని.. ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ సంచలనం సృష్టిస్తుందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ లో ఉన్నాయి.
ఇక ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. ప్రమోషన్స్ ను వేగాంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇందులో ఈ మూవీ రన్ టైం గురించి ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. పుష్ప 2 సినిమా రన్ టైం.. దాదాపు 3 గంటల 15 నిమిషాలు ఉంటుందట. దానికి తోడు మరో రెండు సాంగ్స్ ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేయాల్సి ఉందని.. దీనితో సినిమా పూర్తి టైం మూడున్నర గంటలు ఉంటుందని తెలుస్తుంది. కాగా గతంలో ఇంత భారీ రన్ టైం తో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డు క్రియేట్ చేసిన సంఘటనలు ఉన్నాయి.
అయితే ఇప్పటివరకు సుకుమార్ నుంచి వచ్చే సినిమాల నడివి కూడా మూడు గంటలు ఉండడంతో పుష్ప 2 రన్ టైం పెద్ద ప్రాబ్లం ఏమి కాదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు తమ ఫేవరెట్ హీరో ను మూడున్నర గంటల పాటు స్క్రీన్‌పై చూడడం అంటే వారి ఆనందానికి హద్దులు ఉండవు. ఈ వార్త నిజమైతే బన్నీ ఫ్యాన్స్‌కు ఇంతకంటే గుడ్ న్యూస్ ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం పుష్ప2 మానియా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. పుష్పరాజ్ మరోసారి తన సత్తా చాటుకుంటాడా లేదా వేచి చూడాలి.