చిత్ర పరిశ్రమలో నటించే స్టార్ హీరో , హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఇప్పటికే స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన వారు ఎందరో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు. మరి కొందరు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్టార్ జంటల పేర్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా అక్కినేని కుటుంబం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి తెలంగాణ మంత్రి నాగచైతన్య – సమంత విడాకులపై చేసిన కామెంట్లతో ఒక్కసారిగా అక్కినేని కుటుంబం సోషల్ మీడియాలో ట్రెండ్ లోకి వచ్చింది. ఇక ఇప్పుడు త్వరలోనే నాగచైతన్య – శోభిత పెళ్లి జరగబోతుంది ఈ క్రమంలో నాగచైతన్య – శోభిత పేర్లు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఎప్పుడు ఈ కుటుంబం నుంచి మరో హీరో ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ స్టార్ హీరో ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. ఇంతకి ఆ హీరో మరెవరో కాదు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ .. కాళిదాసు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ .. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ అక్కినేని హీరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇంతకి ఆ హీరోయిన్ మరెవరో కాదు రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మతో సుశాంత్ ప్రేమలో ఉన్నాడని త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఇందులో ఎలాంటి నిజం లేదు .. వీరి ప్రేమ పెళ్ళంతా ఫేక్ .. లైక్స్ కోసం వ్యూస్ కోసం కొన్ని మేం పేజెస్ ఇలా క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వార్తలను మీనాక్షి చౌదరి ఇప్పటికే కొట్టి పడేసింది సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లుకు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఇక సుశాంత్ కూడా ఇలానే క్లారిటీ ఇచ్చాడు.