హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలో రాణించడం అంటే అంత ఈజీ కాదు .. వరుస అవకాశాలు ఉన్న సక్సెస్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందులో కొంత మంది హీరోయిన్లు చేసేవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాల తో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్స్ గా మారిపోతారు. మరి కొంతమంది మాత్రం వరుస అవకాశాలు వస్తున్న హిట్స్ మాత్రం అసలు అందుకోలేరు. అలాంటి హీరోయిన్లు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు చెప్పబోయే ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. హిట్ , ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ముందుకు వస్తుంది.. కానీ ఆమెకు విజయాలు మాత్రం రావట్లేదు. ఇక దాంతో ఇప్పుడు ఆ ముద్దుగుమ్మకు సినిమాలు తగ్గాయి. నిన్న మొన్నటి వరకు వచ్చిన యంగ్ హీరోయిన్స్ విజయాలు అందుకుంటు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంటే ఈ హీరోయిన్ మాత్రం ఇప్పటికీ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా. ఆమె ఎవరో అనేది ఇక్కడ చూద్దాం.
టాలీవుడ్ లోనే ఈ ముద్దుగుమ్మ సినిమాలు , వెబ్ సిరీస్ లు కలిపి 12 చేసింది .. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అయిన పాపాన లేదు. ఇంతకు ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ . ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. అజయ్ భూపతి తెర్కక్కించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ తొలి సినిమాతోనే తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తొలి సినిమాతోనే బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయినటించింది.
ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు తెచ్చి పెట్టలేకపోయాయి. ఎన్టీఆర్: కథానాయకుడు, RDX లవ్,వెంకీ మామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయాపేటిక, మంగళవారం, రక్షణ సినిమాలు చేసింది. వీటిలో ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమా మంగళవారం. ఈ సినిమాకు కూడా అజయ్ భూపతినే దర్శకత్వం వహించాడు. తెలుగు సినిమాలతో పాటు హిందీ పంజాబీ లోనూ సినిమాలు చేసింది. అలాగే ఓ కన్నడ సినిమా కూడా చేసింది పాయల్. కానీ అక్కడ కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా పాయల్ సరైన హీట్ అందుకుంటుందో లేదో చూడాలి.