త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోరటాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో తన రేంజ్ ఏంటో చూపించాడు ఎన్టీఆర్.. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలిభాగం ఇప్పటికే సంచలన విజయం సాధించడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి..
ఇక అందుకే ఇప్పుడు స్టోరీ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. దేవర మొదటి భాగం సక్సెస్ సెలబ్రేషన్ తర్వాత రెస్ట్ మూడ్లోకి వెళ్లిన కొరటాలల శివ.. సంక్రాంతి తర్వాత పార్ట్ 2 వర్క్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రధానంగా మొదటి భాగంలో స్టోరీ యాతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకటంతో సినిమా మొదలవుతుంది .. ఆ క్యారెక్టర్ మాత్రం మొదటి భాగంలో ఎక్కడ చూపించలేదు. ఇప్పుడు రెండో భాగంలో యాతి క్యారెక్టర్ ఎంతో కీలకంగా మారబోతుంది. ఆ పాత్రలో కనిపించబోయే నటుడు కోసం ఇప్పటికే సెర్చింగ్ మొదలుపెట్టారు మేకర్స్.
యతి రోల్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే నటుడ్ని సెలెక్ట్ చేయటం ఆలస్యమయ్యే ఛాన్స్ కూడా ఉందన్నారు. ప్రజెంట్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ , నెక్ట్స్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే దేవర 2 వర్క్ స్టార్ట్ అవుతుంది. అందుకే దేవర 2 స్టార్ట్ అయ్యేది 2026లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు .