అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ కూడా నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన బయటికి రాలేదు. నాగ చైతన్య , శోభిత పెళ్లి గురించి చెప్పగానే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి వీరిద్దరూ 2027లో విడిపోతారని చెప్పారు దీనిపై మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి ఆయనపై సీరియస్ గా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది.
ఈ క్రమంలోని అక్కినని నాగార్జునన.. నాగచైతన్య – శోభిత పెళ్లి గురించి ఓ ఆలోచనలో పడ్డారంటు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే నాగార్జున నాగచైతన్య – శోభిత పేర్లు ప్రస్తావించకుండా తెలుగు ప్రముఖ స్టార్ హీరో అని అతని కొడుకు అని బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించే నటి అని పేర్కొన్నారు. దాని ప్రకారం వణుస్వామి జ్యోతిష్యం చెప్పిన తర్వాత నాగ్ మరో జ్యోతిష్యుణ్ణి సంప్రదించారు.. వారు కూడా వేణి స్వామి చెప్పిన తరహాలో వీరిద్దరు కూడా విడిపోయే అవకాశం ఉందని చెప్పినట్టు వార్త వైరల్ గా మారింది. వీరిద్దరి వివాహం గూరించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నాగార్జున ఉన్నంటూ టాలీవుడ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం.
సోషల్ మీడియాలో నాగార్జున పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత ఇదంతా నాగచైతన్య – శోభిత గురించి అని వారి పేర్లు పెట్టకపోయినప్పటికీ వారిద్దరి గురించి అని.. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ నేటిజన్లు, అక్కినేని అభిమానులు కొట్టి పడేస్తున్నారు. 2022 నుంచి ప్రేమలో ఉన్న నాగచైతన్య , శోభిత పెద్దలను ఒప్పించి ఒకటి కాబోతున్నారు. అయితే విరుద్ధరు విడిపోతారంటూ వస్తున్న వార్తలు అక్కినేని అభిమానులను కలవర పెడుతున్నాయి. శుభమా అని పెళ్లి చేసుకుంటే విడిపోతారా అంటూ వార్తలు రాయటం ఏంటని వేణు స్వామి లాంటి వారు ఇలా పబ్లిక్ గా జ్యోతిష్యం చెప్పడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక మరి వీరి పెళ్లి తర్వాత వీరి జీవితం ఎలా ఉంటుందో చూడాలి.