అడ్వెంచ‌ర్స్ క‌థ‌లో రాముడిగా మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందినున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కోసం.. ప్రస్తుతం మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌లో సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభించడానికి లొకేషన్ వేటలో రాజమౌళి మ‌రోవైపు పరుగులు తీస్తున్నారు. త్వరలోనే ఈ లోకేషన్ ఫైనలైజ్ చేసి ఫారెస్ట్ అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందించనున్నారని టాక్.

Mahesh Babu | #SSMB29 💥 @urstrulymahesh . . © chaand man [x] . . .  #MaheshBabu #SarkaruVaariPaata #SuperStar #PrinceMaheshBabu  #MaheshBabuFans... | Instagram

ఇక‌ మూవీకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా రూపొందించ‌నున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా బ్యాక్ డ్రాప్ కి సంబంధించి ఎన్నో వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. అయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఒక ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుందని కీరవాణి , అలాగే రచయితకి విజ‌యేంద్ర‌ ప్రసాద్ కూడా వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

Mahesh Babu As Lord Rama in Rajamouli Ramayanam|Rajamouli Ramayan First  Look Teaser-Mahesh babu

ఈ సినిమా కథ ఓ నిధి అన్వేషణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. అంతేకాదు సినిమా కథలో రామాయణం ఇతిహాస ప్రస్తావన కూడా వస్తుందని ఫిలిం వర్గాల్లో టాప్ నడుస్తుంది. ఈ క్ర‌మంలోనే కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు రాముడిగా కూడా కనిపించడున్నాడట. వారణాసి బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సీన్స్.. సినిమాల్లో హైలెట్స్‌గా నిలువనున్నాయని.. ఈ సీన్స్ కోసం హైదరాబాద్‌లో వారణాసిని తలపించే సెట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుందని టాక్.