నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో ఏ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చిన బన్నీ.. బాలయ్యతో కలిసి సందడి చేశాడు. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
నేషనల్ అవార్డు గురించి, మెగా ఫ్యామిలీతో తనకున్న సంబంధం గురించి, ప్రభాస్, మహేష్ తో ఉన్న బాండింగ్ అలాంటి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే ఎప్పటినుంచో మెగా అల్లు వారు జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తనకున్న బాండింగ్ గురించి బన్నీ షేర్ చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుందట. అసలు ఊహించని విధంగా బన్నీ పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేసినట్లు టాక్. ఇందులో భాగంగా సెలబ్రిటీల ఫోటోలను చూపించిన బాలయ్య.. వారితో తనకున్న బాండింగ్ గురించి చెప్పమని వారిని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే బన్నీ.. పవన్ కళ్యాణ్ ఫోటోలు చూపించగా కళ్యాణ్ గారు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. వెంటనే బాలయ్య కల్పించుకొని తన దారిలో తాను వెళ్ళిపోతాడు అని చెప్పగానే.. అంతే అంటూ బన్నీ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న మెగా, అల్లు వార్ గురించి అల్లు అర్జున్ ఈ షోలో నోరు విప్పరని.. ఆయన రియాక్ట్ అవుతారని ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి అభిమానులంతా కలిసిపోతారని.. ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ షోలో పవన్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడట. ఇవాళ నైట్ ఆ ఫుల్ ఎపిసోడ్ స్క్రీనింగ్ కానుంది. బాలయ్య, బన్నీ మధ్యలో పవన్ గురించి జరిగిన సంభాషణ ఏంటో తెలియాలంటే.. మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.