హీరోల అంద‌రి వెబ‌న్ ఒక్క‌టే.. అది ఉంటే మూవీ హిట్టేనా..

టాలీవుడ్‌లో ఇటివల‌ కాలంలో తెర‌కెక్కిన సినిమాలు వరుసగా బ్లాక్‌బ‌స్టర్లు అవుతున్నాయి. అయితే ఇటీవ‌ల హీరోల అందరికీ ఒక్కటే వెబ్బన్ గా పనికొస్తుందంటూ.. అది ఉంటే కచ్చితంగా సినిమాలు హిట్ అయిపోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే ట్రెండ్ హీరోలు ఫాలో అవుతున్నారు కూడా. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. అదేనండి గడ్డం. గడ్డం ఉంటే సినిమా హిట్ అవడం ఏంటి కామెడీ కాకపోతే.. ఏదో కథ బాగుంటేనో.. లేదా సినిమాలో కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది కానీ.. హీరోకి గడ్డం ఉంటే సినిమా హిట్ అవుతుందా.. అనుకుంటున్నారు కదా. కానీ.. ఇటీవల కాలంలో ఇదే జరుగుతుంది. మన హీరోలు నిజంగా గడ్డం ఫోబియా అంటుకున్నట్లు అనిపిస్తుంది.

Invest in Devara or Pushpa 2? : r/tollywood

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో నుంచి తెర‌కెక్కి బ్లాక్ బస్టర్లుగా సక్సెస్ అయిన ప్రతి సినిమాలోని హీరోకు గడ్డం ఉంది. అయితే గడ్డం మాత్రమే వెబ‌న్ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్‌లో అది ఉంది. ట్రెండ్‌లో ఏది ఉంటే అదే హీరోలంతా ఫాలో అవుతూ ఉంటారు. కేవలం టాలీవుడ్ హీరోలే కాదు.. తమిళ్ లోను ఇదే ట్రెండ్‌ నడుస్తుంది. కథలతో సంబంధం లేదు.. ప్రతి సినిమాల్లోనూ హీరోలు గడ్డంతోనే మెరుస్తున్నారు. పక్క కమర్షియల్ కు సింబాలిక్ గా గడ్డం మారిపోయింది. ఇటీవల గేమ్ ఛేంజ‌ర్‌ కోసం చ‌ర‌ణ్ గడ్డం పెంచిన సంగతి తెలిసిందే. బాహుబలి నుంచి ఈ గడ్డం ట్రెండ్‌ మొదలైంది. దీనికంటే ముందు హీరోలు ఎన్నో సినిమాల్లో గడ్డంలో కనిపించారు. కానీ.. బాహుబలి నుంచి ఇది ఎక్కువైంది. రంగస్థలం, పుష్ప, భగవంత్‌ కేసరి, దసరా, దేవర ఇలా ఏ సినిమాలో చూసిన హీరోలు కచ్చితంగా గడ్డంతో మెరుస్తున్నారు.

Sankranthi 2025: NBK 109 and Vishwambhara set for an epic face-off? | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

వారికి కూడా ఈ గెటప్ బాగా క్లిక్ అవుతున్నాయి. ప్రస్తుతం దీన్న హీరోలంతా కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఆడియన్స్ లోను గడ్డంతో హీరోస్ ఎంత బాగుంటారా అని ఒరవడిని మన హీరోలు క్రియేట్ చేశారు. పీరియాడికల్ సినిమాఆలోను గడ్డం కామన్ గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్కు కూడా మహేష్ బాబు గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. విశ్వంభ‌ర‌లో చిరంజీవి. ఎన్బికె 109లో బాలయ్య, నా సామి రంగా లో నాగార్జున ఇలా ప్రతి సినిమాల్లోనూ మన హీరోస్ అంతా ఎలివేషన్ కోసం గడ్డంతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకు మించిన ఆయుధం లేదని హీరోలు భావిస్తున్నారు. కనుక దర్శకులు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ సినిమాలు తీస్తున్నారు.