నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్లో NBK 109 రన్నింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. డాకు మహారాజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ని ప్రారంభించారు. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు.. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కథ.
గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది కథ, మరణాన్ని వణికించే మహారాజుది ఈ కథ అనే పవర్ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభించారు. గుర్తుపట్టావా.. డాకు మహారాజ్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ విజువల్స్.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించటం ఖాయం. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం.. ఇప్పటికే బాలయ్య హ్యాట్రిక్ హీట్లతో మంచి ఫామ్ లో ఉన్న క్రమంలో.. ఈ ” డాకు మహారాజ్ ” సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారట.
ఇందులో బాలయ్య క్లాసిక్ లుక్ లోను మెరవనున్నారని సమాచారం. అలాగే దీనిలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందట. దీంతో ఆడియన్స్ లో అంచనాలు మరింతగా పెరిగాయి. మూడు కాలాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా సినిమా రూపొందిందట. ఈ కథ సాగే కాలానికి తగ్గట్లుగా బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఇందులో భాగంగానే బాలయ్యతో ముగ్గురు హీరోయిన్ ఉన్నారట. బాలీవుడ్ కి చెందిన ఊర్వశి ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. ఇక మలియాళ సినీ ఇండస్ట్రీకి చెందిన మరో నటుడు మరువనున్నాడట. అంతేకాదు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. 12 జనవరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.