టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఆడియన్సలో పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన పేరు ముందు దిల్ యాడ్ అయింది. ఈ క్రమంలోనే దిల్ రాజుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనూ దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఇక తాజాగా ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది.
జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మూవీ టీజర్ కూడా రిలీజై ప్రస్తుతం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇలా సినీ ఇండస్ట్రీలో దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా ఎంతో ఖ్యాతిని పొందారు. ఇక పర్సనల్ విషయానికి వస్తే దిల్ రాజు మొదట అనిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి హన్షిత అనే కూతురు కూడా ఉంది. 2017లో అనిత హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. భార్య మరణంతో ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. కొంతకాలం డిప్రెషన్ కి వెళ్ళారు.
ఈ క్రమంలోనే కుమార్తె హన్షిత తండ్రికి రెండో వివాహం చేసింది. తనకు పెళ్ళై.. పిల్లలు ఉన్నా కూడా తండ్రిని మరో ఇంటివాడని చేయాలని ఫిక్స్ అయింది. అలా దిల్ రాజు వైకా రెడ్డి.. అలియాస్ తేజస్విని అనే ఏయిర్ హాస్టస్‌ను వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి కూడా 2022లో ఒక కుమారుడు పుట్టాడు. అతనికి అన్విత్ రెడ్డి అని పేరు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో దిల్ రాజు భార్యతో తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకుంది. అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది. ఇటీవల ఆమె లా(law ) చదువు పూర్తి చేసుకున్నట్లు.. దానికి తన తల్లి ముఖ్య కారణం అంటూ ఇన్స్టాగ్రామ్ లో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం తేజస్విని చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.