ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ ప్రిన్సెస్‌ను గుర్తుపట్టారా..? ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగు పదుల వయసులోనూ రిఏజ్‌నింగ్ చేసుకుంటూ.. మరింత యంగ్ లుక్‌తో కుర్రాళ్లను కవ్విస్తుంది. పిల్లలు ఉన్నా.. ఇప్పటికీ అదే హాట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా దాదాపు టాలీవుడ్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు శ్రియ శరణ్. 42 ఏళ్ళ వయసులోనూ తన అందంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. హరిద్వార్, ఉత్తరాఖండ్‌లో జన్మించింది.
అక్కడే తన చదువును పూర్తి చేసి సినిమాలపై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిర్ణయాన్ని పేరెంట్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాల్లో అవకాశాల వేట మొదలెట్టింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ విక్రమ్ కుమార్ కంటపడి ఇష్టం సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రేక్షకుల్లో మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలను కొట్టేసింది. ఇక నాగార్జునతో 2002లో నటించిన సంతోషం మూవీ మరింత పాపులారిటి తెచ్చిపెట్టింది. బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, చిరంజీవితో ఠాగూర్, నాగర్జునతో నేనున్నాను, తరుణ్ తో నీవే నీవే లాంటి సినిమాల్లో నటించే ఆకట్టుకుంది. అంతే కాదు పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, వెంకటేష్ ఇలా అందరితోనూ ఆడి పాడింది. తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, ఆంగ్లం లోను ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
ఇప్పటివరకు దాదాపు అన్ని భాషలు కలిపి 70కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన శ్రీయ.. పెళ్లయిన తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంది. క్యారెక్టర్లకు ప్రాధాన్యత ఉన్న చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది. ఇక తమిళ్ స్టార్ హీరో సూర్య 44వ సినిమాలో శ్రియ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక 2018లో రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు బిజినెస్ మ్యాన్‌ని వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. ఈ మ్యాటర్ చాలా కాలం సీక్రెట్ గా ఉంచింది. రెండు నెలల తర్వాత ఈ విషయం వైరల్ కావడంతో నిజమైన అంటూ కన్ఫామ్ చేసిన ముద్దుగుమ్మ.. తర్వాత ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకు రాధా అనే పేరు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న శ్రేయ.. సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను కవిస్తోంది. మరోవైపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది.