అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య మొదట స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలానికే వీరు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉందంటూ.. నాగచైతన్య, శోభితత మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ.. ఎన్నో వార్తలు వినిపించాయి, వాటిని నిజం చేస్తూ శోభితతో ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్‌కు షాక్ ఇచ్చాడు చైతన్య. ఇక వీరిద్దరు పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్లో డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్లో జరగనుందని టాక్.
ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి ఈ జంటకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్‌లు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే శోభిత.. చైతన్యను పెళ్లి చేసుకోవడం కోసం షాకింగ్ డెసిషన్ తీసుకుందని.. అక్కినేని ఫ్యామిలీ పెట్టిన ఓ కండిషన్‌క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటో.. నాగచైతన్య కోసం శోభిత చేసిన త్యాగం ఏంటో.. ఒకసారి చూద్దాం. మొదట్లో నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం సమంత చేస్తున్న సినిమాలు అన్ని.. సమంత ఓల్డ్ వెబ్ సిరీస్ లలో నటించడం మొదలుపెట్టిన తర్వాత వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు మొదలయ్యాయని.. ఆ గొడవలు కాస్త పెద్ద అవడంతో వీరు విడాకులు తీసుకున్నారు అని వార్తలు వినిపించాయి. సమంత, చైతు లైఫ్ లో జరిగిన తప్పే మళ్ళీ శోభిత విషయంలోనూ జరగకూడదని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నారట.
పెళ్లికి ముందే శోభిత ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్ కానీ.. సినిమాల్లో కానీ.. నటించకూడదని కండిషన్ పెట్టేసారట. చైతన్యను ఎంతగానో ప్రేమించడంతో శోభిత కూడా ఈ కండిషన్లు కాదనలేకపోయిందట. ఈ క్రమంలోనే శోభిత కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని.. నాగచైతన్య పట్ల ఎంత ప్రేమ ఉందో దాన్ని డెసిషన్ తోనే ఆ ఫ్యామిలీకి వెల్లడించింది అంటూ టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ్యూస్ వైరల్ అవ్వడంతో.. అమ్మడి డెసిషన్‌కు ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది మాత్రం చైతుపై ఎంత ప్రేమ ఉన్నా.. తాను సంతోషం కలిగించే పని మానుకొని త్యాగం చేయాల్సిన పనిలేదంటూ.. చైతు, శోభిత పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ ఇలా రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.