గత కొంతకాలంగా టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ తెగ వైరల్ గా మారుతుంది హీరోయిన్ కావ్య థాఫర్. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య థాఫర్ మాట్లాడుతూ.. తనకు గతంలో ఎదురైన ఒక క్యాస్టింగ్ కౌచ్ అవనభవాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. సిగ్గు లేకుండా ఓ వ్యక్తి తనను కమిట్మెంట్ అడిగాడంటూ వెల్లడించింది.
ఇది కెరీర్ ప్రారంభంలో జరిగిన సంఘటన అంటూ చెప్పుకొచ్చిన కావ్య.. ఓ యాడ్ ఆఫర్ కోసం ఆడిషన్స్ అని వెళ్ళాను. అయితే నాలుగు యాడ్స్ ఇస్తా.. కానీ నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వు అంటూ సిగ్గులేకుండా వ్యక్తి అడిగాడని.. అలాంటివి నాకు అసలు నచ్చవని మొఖం పైనే చెప్పేశా. కానీ.. పదేపదే.. అదే విషయాన్ని గురించి రెట్టిస్తూ అడిగాడు.. వెంటనే అక్కడి నుంచి కోపంతో బయటకి వచ్చేసా అంటూ చెప్పుకొచ్చింది. నన్ను నటిగా చూడాలనేది మా డాడీ డ్రీమ్.. అందుకే డిగ్రీ పూర్తవుగానే యాక్టింగ్ వైపు అడుగు వేసా అంటూ వివరించింది.
అలా కొన్ని యాడ్స్ లో నటించిన తర్వాత ఈ మాయ పేరేమిటో సినిమాలో అవకాశం దక్కిందంటూ కావ్య థాఫర్ చెప్పుకొచ్చింది. ఇక పేరుకు పంజాబీ అమ్మాయి అయినా.. ఎక్కువగా తెలుగులోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే ఏక్ మినీ కథ, డబ్బులు ఇస్మార్ట్, విశ్వం, ఈగిల్ ఇలా ఎన్నో సినిమాల్లో కావ్య నటించి తన అందం, నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాల్లో కంటెంట్ సరిగ్గా లేకపోవడంతో ఫ్లాప్ గా నిలిచాయి.