ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు టాలీవుడ్ ఆగ్ర హీరోలు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఒకే సినిమాలో ఇద్దరు సార్ హీరోలు కలిసిన నటిస్తున్నారంటే అభిమానుల్లో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అలాంటిది నందమూరి మెగా కాంబోలో సినిమా ఫిక్స్ అయిందంటే.. ఫ్యాన్స్‌లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి ఓ కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయిందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయిందట. డైరెక్టర్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కాంబోలో సినిమా తీయాలని ఫిక్స్ అయి మంచి కథను రాసుకున్నాడట. ఇదే విషయాన్ని బాలయ్యకు వినిపించాడట. అయితే బాలయ్య కథను రిజెక్ట్ చేశాడట. బాలయ్య ఆ సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో చూద్దాం. ఇంతకీ ఆ సినిమా ఏంటో చెప్పలేదు కదా అదే గోపాల గోపాల. వెంకటేష్, పవన్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాలో మొదట వెంకటేష్ పాత్ర కోసం బాలయ్యను అనుకున్నారట.
బాలయ్య అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా ఉంటుందని అభిప్రాయంతో ఆయన వద్దకు వెళ్లి కథ వినిపించారట. కానీ.. బాలయ్య తన బాడీ లాంగ్వేజ్ కి ఆ క్యారెక్టర్ అస్సలు సెట్ కాదని అభిప్రాయంతో దానిని రిజెక్ట్ చేసారట. అంతేకాదు దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే.. నేను ఇలాంటి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. హార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాలు నటించడం కుదరదని చెప్పేసాడట. తర్వాత ఈ సినిమాలో నటించే ఛాన్స్ వెంకటేష్‌కు రావడం.. కథ కూడా ఆయనకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటించాడు. ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.