మహేష్ కు ఆ హీరోను చూస్తేనే ఒళ్ళు మండిపోతుందా.. అంత చెత్త పని ఏం చేశాడంటే.. ?

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్న మహేష్.. రాజమౌళి డైరెక్షన్లో త్వరలోనే సినిమాలో నటించనున్నాడు. ఇక మహేష్ మొదటినుంచి సాఫ్ట్ మెయిండెడ్‌, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన హీరో అని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఎప్పుడు తనపై వెటకారమైనా కామెంట్స్ వినపడిన వెంటనే.. తెలివిగా మహేష్ కౌంటర్ వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే మహేష్‌కు ఆడవాళ్లను ఎవరైనా అంటే ముందు నుంచే చాలా కోపం వస్తుందట.

Mahesh Babu shares adorable candid click with Namrata Shirodkar on wedding  anniversary

అది కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాదు.. బయట వారినైనా ఆడవారిపై ఎవరైనా కౌంటర్ వేసినట్లు మాట్లాడితే.. లేదా బూతు పదాలతో వాళ్లను అవహేళన చేసిన.. ఆయనకు ఒళ్ళు మండిపోతుందట. ఈ కారణంతోనే మహేష్ బాబుకి ఇండస్ట్రీలో ఉండే ఓ హీరో అంటే అసలు నచ్చిందట. ఆయన ముఖం చూడడానికి కూడా మహేషట్కు ఇష్టముండదట. దాదాపు టాలీవుడ్ లో ఉండే అందరు హీరోలతో ఎంతో చనువుగా ఉండే మహేష్.. బాలీవుడ్ హీరోలతో మాత్రం ఎంతో ఆలోచించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే గతంలో నమ్రతకు ఫ్రెండ్ అయినా ఓ బాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇంటికి వచ్చి చాలా వెటకారంగా కామెంట్లు చేస్తూ ఇన్ డైరెక్ట్ బూతు అర్థం వచ్చేలా జోకులు వేసాడట.

The best gift Mahesh Babu fans can get

దాంతో మహేష్ కు ఫుల్ గా కోపం వచ్చేసిందట. అప్పటికి ఎంతో కంట్రోల్ చేసుకున్న మహేష్.. నమ్ర‌త‌ ఫ్రెండ్ కదా అని ఎంతో ఓర్చుకున్నారట. అయినా అతన్ని మాటలు వ్యంగ్యంగానే అనిపించడం.. చాలా కఠినంగా అనిపించడంతో అప్పటినుంచి మహేష్ కు ఆ హీరో అంటే అసలు నచ్చదట. మరోసారి మహేష్ ఇంటికి ఎప్పుడు ఆ బాలీవుడ్ హీరోను ఆహ్వానించలేదట. నమ్ర‌త‌తో కూడా అతనితో స్నేహం చేస్తే అసలు బాగోదని ముఖంపై చెప్పేసాడట. మహేష్ బాబుకు ఇప్పటికి ఆయనపై అలానే కోపం ఉందని.. ఏదైనా ఈవెంట్లో ఆ హీరో ఎదురుపడిన మొఖం కూడా చూడకుండా పక్కకు వెళ్ళిపోతాడు అని టాక్.