పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూనే.. మరో పక్కన సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలకరుకు తన సినిమాల కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టిన పవన్.. పెండింగ్‌లో ఉన్న మూడు సినిమాలను పూర్తిచేసి ఎలాగైనా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా వ్యక్తి నుంచి సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమా అంటే.. ఇక ఆ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
కాగా దేవర బ్లాక్ బస్టర్ తర్వాత ఓజీ ప్రొడ్యూసర్ దానయ్య.. ఈ సినిమా బిజినెస్‌కు భారీ రేట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సీడెడ్ కాకుండా..కేవలం ఆంధ్రప్రదేశ్‌ఖు ఏకంగా రూ.70 కోట్ల రేంజ్ లో రేట్లు చెప్తున్నారని.. చివరకు జిఎస్టి తో కలుపుకొని రూ.65 కోట్లకు ఫైనల్ చేయనునట్లు టాక్. ఇక ఎంత రేట్లు చెప్పిన పవన్ క్రేజ్ రిత్య బయర్లు రైట్స్ కొనేందుకు ముందుకు వస్తున్నారు. కానీ.. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. జనసేన లీడర్లు కూడా ఏరియాల వారీగా ఓజి సినిమా రైట్లు తమకు అమ్మాలంటూ పట్టుబడుతున్నారట. లోకల్ బయ్యర్లను పక్కన పెట్టేసి మరి వైజాగ్, ఈస్ట్, నెల్లూరు ఇలా ప్రతి చోట తమ లీడర్లకే సినిమా ఇవ్వాలంటూ జనసేన పట్టుబడిన్నట్లు సమాచారం.
ఇక ఒకే ఏరియాకు ఏకంగా ముగ్గురు నలుగురి మధ్యన కాంపిటీషన్ ఏర్పడిదని.. ఈస్ట్ గోదావరి హక్కులు తనకు తప్ప మరెవరికి ఇవ్వకూడదని ఇప్పటికే ఎంపీ టీ టైమ్ అధినేత తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక విశాఖ తనకే కావాలంటూ జనసేన కీలక నేత పట్టుబట్టడట. ఇవన్నీ చూసి రెగ్యులర్గా సినిమా వ్యాపారంలో ఉన్న బయ్యర్లు.. ఇప్పుడు మాతో వాళ్ళకు ఇలాంటి పోటీ ఏంటి అంటూ వాపోతున్నారట. అయితే ఏ ఏరియాల హక్కులను ఇంకా ఎవరికి ఫిక్స్ చేయలేదు. ఇక ఓజిని మార్చ్‌లో రిలీజ్ చేస్తారని టాక్. ఈ క్రమంలోనే.. గ్యాంగ్ స్టార్ సినిమా కోసం జనసేన లోనే గట్టి పోటీ నెలకొందని తెలుస్తుంది. అంతేకాదు హరిహర వీరమల్లు మేలో రిలీజ్ చేయనున్నారు. దీనికి కూడా జనసేన వారే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి జనసేనల పవన్ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ అర్థమౌతుంది.