నటి సురేఖ వాణి.. ఆమె కూతురు సుప్రీతలకు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుప్రీత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకపోయినా సురేఖవాణి డాటర్‌గా భారీ పాపులారిటి దక్కించుకుంది. ఈ అమ్మ, కూతుర్లు ఇద్దరూ తమ గ్లామర్ ఫోటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తూనే ఉంటారు. ఇక సుప్రీతా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో నటించకపోయినా పాపులర్ అయిన సుప్రీత.. తన పెట్టే ఫొటోస్ తో, వీడియోస్ తో కుర్రకాలను ఫిదా చేస్తుంది.
ఇక సినీ బ్యాగ్ డ్రాప్ ఉన్న సురేష్ తేజ, సురేఖ వాణి కూతురుగా సుప్రీత చిన్న వయసు నుంచే మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. తన టాలెంట్ తో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. యూట్యూబర్‌గా ఫేమస్ అయిన సుప్రిత.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో కుర్రకారును కవ్విస్తుంది. నటన మీద ఉన్న ఆసక్తితో 2019లో మనీ మైండ్ గర్ల్ ఫ్రెండ్.. షార్ట్ ఫిలిం లో నటించి ఆడియన్స్ మెస్మరైజ్ చేసింది. అనంతరం అవర్స్ వర్సెస్ అదుర్స్, వెళ్ళిపో, గాయత్రి పోతే పోవే అనే పాటలతో ప్రేక్షకులను అలరించింది.
ఇప్పుడు రీసెంట్గా సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి క్రమంలో ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సుప్రీత ఇటీవల ఓ వ్యక్తితో కలిసి బెంగళూరులో పబ్బుల్లో తిరుగుతోందని.. తెగ ఎంజాయ్ చేస్తుందని సమాచారం. ఇంతకీ అబ్బాయి ఎవరు.. ఏంటనే.. విషయాలు తెలియకపోయినా తన బాయ్ ఫ్రెండ్ అని అంతా భావిస్తున్నారు. బెంగళూరు వీధుల్లో అతనితో చట్టపట్టలేసుకొని తిరుగుతూ.. పార్టీలను ఎంజాయ్ చేస్తుందట. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. కాగా సురేఖ వాణి గతంలో తల్లిగా, అక్కగా, చెల్లిగా, కోడలుగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సురేఖ.. మరోసారి అవకాశాలను కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా త్రో బ్యాక్ అవుతుందనడంలో సందేహం లేదు.