టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయవసరం లేదు. వేదం, గమ్యం, కంచే, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకున్న ఈయన.. ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. గతంలో క్రిష్ రమ్య వెలగా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనస్పర్ధలతో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక గత కొద్ది రోజులుగా డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి క్రమంలో ఆ వార్తలను నిజం చేస్తూ డాక్టర్ ప్రీతి చెల్లాను వివాహం చేసుకున్నాడు క్రష్. ఇంతకీ ప్రీతి చెల్లా ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రీతి చల్లా.. ప్రముఖ గైనకాలజిస్ట్ గా వ్యవహరిస్తుంది. డైరెక్టర్ క్రిష్ తాజాగా ఆమెను రెండో వివాహం చేసుకోగా.. ఈ జంట స్వయంగా తమ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ఫొటోస్ ద్వారా దీనిని ప్రకటించారు. తాజాగా వీరు పెళ్ళికి సంబంధించిన పెళ్లి పిక్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక ప్రీతి ప్రముఖ చెల్లా హాస్పిటల్స్ కు చెందిన అమ్మాయి. ఈమె చెన్నైలో శ్రీరామచంద్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్, గైనకాలజిస్ట్ ఎమ్ఎస్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చల్లా హాస్పిటల్ లో సీనియర్ గైనకాలజిస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రీతి.. హాస్పటల్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇక ప్రీతి చెల్లకు కూడా ఇది సెకండ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. వీరి పిక్స్ వైరల్ గా మారడంతో.. నెటిజన్స్‌తో పాటు.. క్రిష్ అభిమానులు అలాగే ఎంతో మంది ప్రముఖులు ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.