కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్.. ఫ్యాన్స్, మూవీ లవర్స్ కు అందిస్తూ మేకర్స్ ఫుల్ ఖుష్ చేస్తున్నారు.
ఇక ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొల్పుతున్న పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిసిక్‌లో శ్రీ లీల చిందేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీ లీల పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట కోసం శ్రీ లీలా తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం శ్రీ లీల కిసిక్ సాంగ్ కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట.
మొదటినుంచి శ్రీ లీల చాలా బ్రేవ్ గా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఒక్కసారిగా డిమాండ్ ఉన్న సినిమా కాబట్టి టాప్ రెమ్యూనరేషన్‌ని పట్టేసిందని సమాచారం. ఇక ఈ మూవీలో మళయాళ నటుడు ఫహద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. జగదీష్, ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాష్, సునీల్, అనసూయ భరద్వాజ, రావు రమేష్, ధనుంజయ్ షణ్ముఖ్, శ్రీ తేజ ఇతరులకి కీలకపాత్రలో కనిపించనున్నారు.