మహేష్ – జక్కన కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 సినిమా త్వరలో సెట్స్‌పైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూట్ పూర్తి చేసుకుంటుందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అంటూ ఇప్పటికి అభిమానులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి సినిమాను వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్ నడిచింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు పై తుమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వెయ్యికోట్లను క్రాస్ చేసే అవకాశం ఉందని.. సినిమాలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు నటించనున్నారు అంటూ వెల్లడించాడు. బిజినెస్ కూడా రూ.2000 కోట్ల వరకు క్రాస్ చేయొచ్చు అని టీం భావిస్తున్నట్లు వెల్లడించాడు. అంతకుమించి వసూలు చేసే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చాడు.
ఇక ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ అయ్యి రూ.3000 నుంచి రూ.4000 కోట్ల కలెక్షన్లు సాధిస్తే నిజంగానే ఇది ఇండియన్ చరిత్రలోనే గ్రేటెస్ట్ రికార్డు అవుతుందంటూ తుమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా బిజినెస్ను ఊహించడం కూడా కష్టంగా ఉందని వెల్లడించిన ఆయన.. జక్కన్న భవిష్యత్తును బాగా ఊహిస్తారని చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత రూ.300 కోట్ల బడ్జెట్ ఆయన కెపాసిటీకి చాలా చిన్న బడ్జెట్ అయిందంటూ చెప్పుకొచ్చాడు. తన విజన్‌తో ఇండస్ట్రీ స్థితి గతులన్నీ జక్కన్న మార్చేసాడని వివరించారు. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకోవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు.
తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి29 పై చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవడంతో.. ఇటు మహేష్ ఫ్యాన్స్, అటు జక్కన్న ఫ్యాన్స్‌లో కూడా సరికొత్త జోష్ నిండింది. మహేష్, జక్కన్న కాంబోలో సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా.. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా బాగుంటుందంటూ అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇక సినిమా క్రేజీ అప్డేట్స్ త్వరలోనే అఫీషియల్‌గా వెల్లడించనున్నారని సమాచారం. ఇక ఆడియన్స్ ఊహలకు అందని మరో అద్భుతాన్ని మహేష్ సినిమాతో.. జక్కన్న బాక్స్ ఆఫీస్ కు అందిస్తాడో లేదో వేచి చూడాలి.