” మన్మధుడు ” మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. భర్తతో కలిసి ఉన్న స్వీట్ మెమోరీస్

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటివరకు ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలా నాగార్జున కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో మన్మధుడు ఒకటి. ఈ సినిమా ఆడియన్స్ లో ఓ ఫీల్ గుడ్ మూవీ గా నిలిచిపోయింది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేలా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఇప్పటికీ టీవీలో సినిమా వస్తుందంటే చాలు స్క్రీన్ కు అతుక్కుపోయి చూసే ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. కాగా.. ఈ సినిమాల్లో హీరోయిన్లుగా సోనాలి బింద్రే, అన్షు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక మన్మధుడు సినిమాతోనే హీరోయిన్గా అన్షు.. త‌ను మూవీలో కనిపించింది 20, 25 నిమిషాలు అయినా ఆడియన్స్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అచ్చ తెలుగు ఆడపిల్లల.. మహేశ్వరి పాత్రలో జీవించేసింది. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మన్మధుడు తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో నటించిన అన్షు.. సినిమా సక్సెస్ అందుకోకపోయినా తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా తర్వాత హీరోయిన్గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో.. శివాజీ, భూమిక.. హీరో, హీరోయిన్గా నటించిన మిస్సమ్మ సినిమాలో ఓ గెస్ట్ రోల్లో మెరిసింది. తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. తమిళ్‌లో ఓ సినిమాలో నటించి మెప్పించింది.

 

ఈ సినిమా తర్వాత.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లయి తాజాగా 14 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో.. త‌న‌ ఫ్యామిలీ ఫొటోస్.. తన భర్త, పిల్లలతో కలిసి స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ పిక్స్ అభిమానుల‌తో షేర్ చేసుకుంది. అంతేకాదు అమ్మడు త్వరలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంద‌ట.. ఈ క్రమంలోనే తన గ్లామర్ ఫోటోస్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. మీరు ఓ లుక్ వేసేయండి.