రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.. ఎవరు పెట్టారంటే..?

సౌత్‌ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈయ‌న డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకుంది. టాలీవుడ్ లో సక్సెస్ రేట్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. తన సినిమాలతో సక్సెస్ అందుకోవడమే కాదు.. ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డును కూడా దక్కించుకొని తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేశాడు. ఇక ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎక్కడ చూసినా రాజమౌళి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

Rajeev kanakala - S. S. Rajamouli – a name that resonates... | Facebook

కాగా రాజమౌళి.. ప్ర‌స్తుతం మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ సినిమాను తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవ‌రీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఇకపోతే రాజమౌళిని సినీ ఆడియన్స్‌తో పాటు.. సాధారణ ప్రేక్షకులు కూడా ముద్దుగా జక్కన్న అని పిలుస్తూ ఉంటారు. అయితే రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎందుకు వచ్చింది.. అసలు ఆ పేరు ఎవరు పెట్టారో.. ఒకసారి చూద్దాం. రాజమౌళి సినిమా పిచ్చోడన్న సంగతి ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ప్రతి సన్నివేశం కూడా పర్ఫెక్ట్ గా రావాలని ఆయన ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు. అందుకు తగ్గట్టుగానే సన్నివేశాన్ని ఎన్ని రకాలుగా షూట్ చేయవచ్చు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. అందుకే ఆయనను ముద్దుగా అంత జక్కన్న అని పిలుస్తారు.

Rajeev Clarifies About Rumours Of His Split With Suma!

మరి ఇంతకీ జక్కన్న అని రాజమౌళికి పేరు పెట్టింది ఎవరు అనుకుంటున్నారా.. రాజమౌళికి ఆ పేరు పెట్టింది ప్రముఖ టాలీవుడ్ యాంకర్ సుమ భర్త.. నటుడు రాజీవ్ కనకాల. రాజమౌళికి ఆ పేరును రాజీవ్‌ కనకాలనే పెట్టారట. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఓ రోజు రాజమౌళితో అరపేజీ డైలాగ్ షూటింగ్ కోసం వెళ్లానని.. ఒక రెండు గంటల్లో షూటింగ్ పూర్తవుతుందని నేను వెళ్తే.. అరపేజీ సీన్ షూట్ కోసం రాజమౌళి ఏకంగా అర్ధరాత్రి 12:30 దాటిన పూర్తి చేయకుండా చేస్తూనే ఉన్నారని.. వామ్మో పని రాక్షసుడు.. సీన్లను జక్కన్నలా చెక్కుతూనే ఉన్నాడని సరదాగా అన్నాను. అయితే ఆ పేరే జక్క‌న్న అంటూ రాజమౌళికి ముద్ర పడిపోయింది అంటూ రాజీవ్ కనకాల వెల్లడించాడు. ఇక రాజీవ్ కనకాల మొదటి నుంచి రాజమౌళికి మంచి స్నేహితుడు. శాంతినివాసం సీరియల్ నుంచి వీరిద్దరి మధ్యన మంచి బాండ్ ఉంది. అప్పటి నుంచే రాజమౌళి సినిమాలలో రాజీవ్ కనకాల ఇప్పటికి చిన్న చిన్న పాత్రలో కనిపిస్తూనే ఉంటారు.