టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆడియన్స్‌కు మాస్ ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది గెస్ట్‌లుగా వచ్చి సందడి చేస్తున్నారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక అన్ స్టాపబుల్ ఫోర్త్ సీజన్ ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా.. మొదటి ఎపిసోడ్ ఏపి సియం చంద్ర బాబు, రెండొవ ఎపిసోడ్‌కు హీరో దుల్కర్ సల్మాన్, మూడవ ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నాలుగవ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ చేశారు.
ఈ నాలుగు ఎపిసోడ్‌లకు ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా.. బన్నీ ఎపిసోడ్ బ్లాక్ బాస్టర్ అయింది. రికార్డ్ వ్యూస్ ను క్రియేట్ చేసుకుంది. దీంతో సీజన్ 4.. ఐదవ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా ఎవరు రానున్నారని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు ఆ నిరీక్షణకు చెక్ పడింది. డాన్సింగ్ క్వీన్.. కిసికి బ్యూటీ శ్రీ లీలా, బాలయ్య టాక్ షోలో సందడి చేయనుందట. జాతిరత్నం ఫేమ్ నవీన్ పోలిశెట్టి కూడా ఈ టాక్ షోలో హాజరుకానున్నాడని సమాచారం.
ఇక గతంలో బాలయ్య, శ్రీలీల భగవంత్ కేసరిలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ రికార్డ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 4 తాజా ఎపిసోడ్‌తో బాలయ్య మరోసారి అదే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని.. శ్రీ లీల విత్ బాలయ్య వన్స్ మోర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీలీల ఆహా స్టూడియో కు చేరుకున్న పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. స్లీవ్ లెస్ టాప్.. చీరకట్టులో క్యారవాన్ ముందు హోయలుపోతు.. శ్రీ లీల అందరిని మెస్మరైజ్ చేస్తుంది.