టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ గా పుష్ప 2.. ఈ ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అటూ సోషల్ మీడియాలో, ఇటు జనరల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప 2 పేరు మారుమోగిపోతుంది. కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో హైప్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంత బజ్ ఉన్న సినిమాకు.. ఇప్పుడు వైసీపీ ప్రీ పబ్లిసిటీ కూడా తోడవుతుంది. వైసీపీ నేత అంబటి రాంబాబు తాజాగా పుష్ప 2కి తన స్టైల్‌లో ప్రమోషన్స్ చేస్తూ ఎలివేషన్లు ఇచ్చాడు. పార్ట్ 1 అద్భుతంగా ఉందని హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ చేశారని చెప్పిన అంబటి.. పార్ట్ 2 కోసం.. అందరితో పాటే తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు.
అసలు అంబటి రాంబాబు ఏంటి.. సినిమా ప్రమోషన్స్ చేయడం ఏంటి.. వైసీపీకి పుష్ప 2 ప్రమోషన్స్ కి సంబంధమేంటి.. అనుకుంటున్నారా. అసలు మ్యాటర్ ఏంటంటే.. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా బన్నీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. నంద్యాల వెళ్లి మరి వైసీపీ అభ్యర్థిని గెలిపించమంటూ ప్రచారం చేసి వచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ, మెగా అభిమానుల మధ్య కోల్డ్ వార్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే బన్నీ ప్రచారం చేసిన చోటా వైసీపీ ఓడిపోయిన.. అప్పుడు వైసీపీకి బన్నీ సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు బన్నీ సినిమాలకు వైసీపీ మద్దతుగా నిలుస్తుంది. ఇది పుష్ప 2పై వైసీపీ అంత ప్రేమ కురిపించడానికి కారణం కూడా అదే. అంతే కాదు జనసేన కార్యకర్తలు అంతా బన్నీ సినిమాపై కక్షతో ఉన్నారు. ఈసారి బన్నీ సినిమాను అసలు సపోర్ట్ చేసేదే లేదంటూ.. ఆ సినిమాను చూడను కూడా చూడమంటూ చెప్పేస్తున్నారు.
ఇక జనసేన క్వైట్ ఆపోజిట్ గా వైసీపీ ఎప్పటికప్పుడు తన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే బన్నీకి జనసేన యాంటీగా ఉంది కాబట్టి.. వైసీపీ పుష్ప 2 ప్రమోషన్ల బాధ్యతను నెత్తిన వేసుకుంది. కాగా అంబటి మాట్లాడుతూ.. బన్నీ సినిమాను ఎవరు ఆపలేరని.. సినిమాలో కంటెంట్ ఉంటే ఎంత తొక్కేయాలని చూసినా అది హిట్ అయి నిలుస్తుందని కామెంట్ చేశాడు. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాని తొక్కేయాలని చూసారని.. అది కుదరలేదు.. ఇక ఇప్పుడు మళ్ళీ బన్నీ సినిమాను తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అది సాధ్యం కాదంటూ పక్కా సినీ వాదిగా అంబటి కామెంట్ చేశారు. అయితే సినీ ఇండస్ట్రీపై, బన్నీపై వైసీపీ ప్రభుత్వానికి అంతా ప్రేమ, ఆప్యాయత ఉంటే మరీ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో కనీసం సినీ ఇండస్ట్రీని ఎందుకు పట్టించుకోలేదు.. ఇక ఇప్పుడు సపోర్ట్ గా హాలీవుడ్ మూవీ అంటూ మాట్లాడుతున్న.. వైసీపీ పుష్ప 1 సినిమా టికెట్ల విషయంలో కూడా ఎందుకు సహకరించలేదు అంటూ నెటిజన్లలో సందేహలు మొదలయ్యాయి.