ఆ స్టార్ హీరోయిన్ మాజీ లవర్ తో సమంత డేటింగ్ .. అందుకే ఆమెకు బ్రేకప్ చెప్పాడా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సమంత ఎలాంటి ఇమేజ్ను దక్కించుకుందో తెలిసిందే. అయితే సమంత మాజీ భర్త నాగ చైతన్య.. ఆమెతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకున్ని అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అవన్నీ పుకార్లు అని ఇప్పటికే తేలిపోయింది. అయితే.. తాజాగా మరోసారి సమంత సెకండ్ మ్యారేజ్ న్యూస్ వైర‌ల్‌గా మారుతుంది. అది కూడా బీటౌన్‌ స్టార్ సెలబ్రెటీని ఈమె వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారా.. ఓ సీనియ‌ర్ హీరోయిన్ మాజీ లవర్‌ని సమంత త్వరలోనే పెళ్లాడబోతుందట. అందుకే ఆ హీరో.. హీరోయిన్‌కు బ్రేకప్ కూడా చెప్పేసాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Mushy photos of Arjun Kapoor and Malaika Arora that scream volumes of their love

ఇంతకీ మేటర్ ఏంటంటే.. సమంత బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ కొడుకు అర్జున్ కపూర్ తో ప్రేమాయణం లో ఉందని.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే సమంత అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకోబోతుందట. బోనికపూర్ కోడలుగా ఆ ఇంట్లో సమంత అడుగు పెట్టబోతుందని టాక్‌. ఇక తాజాగా.. అర్జున్ కపూర్ తన ప్రియురాలు సీనియర్ హీరోయిన్ మలైకా అరోరాకు బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మలైకతో విడిపోయిన కొద్ది రోజులకే సమంతతో అర్జున్ స‌మంత‌తో ప్రేమాయ‌ణం నడుపుతున్నాడని.. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మ‌రోవైపు.. అర్జున్ అప్పటికే సమంతతో ప్రేమలో ఉండడంతోనే మలైకా అరోరకు బ్రేకప్ చెప్పాడని మరో పక్కన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Samantha Ruth Prabhu posts poem by Rudyard Kipling; Arjun Kapoor calls it 'inspiration' - Hindustan Times

ఇక సమంత ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో.. మంచి కవితను అభిమానులతో షేర్ చేసుకోగా సమంత పెట్టిన ఈ పోస్ట్ కి అర్జున్ కపూర్ ఈ కవిత చాలా ఆదర్శంగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పెళ్లి వార్తలు, డేటింగ్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. సమంత అర్జున్ మధ్య ఎప్పటినుంచో మంచి పరిచయం ఉందని.. వీరిద్దరి పెళ్లికి సిద్ధంగా ఉన్నారంటూ బీటౌన్‌లో జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. శ్యామ్ రెండో పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే సమంత అసలు పెళ్ళే చేసుకోనంటూ గతంలోకి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తోటి సెలబ్రిటీల అర్జున్ కపూర్, శ్యామ్ పోస్ట్ కు రిప్లై ఇచ్చారా.. లేదా వీరిద్దరి మధ్యన నిజంగానే ప్రేమ ఉందా..? అర్జున్తో పెళ్ళంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే.. అర్జున్ కపూర్ కానీ.. సమంత కానీ.. రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.