మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చరణ్‌కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ మగధీర. ఎస్. ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో కాజల్ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నింటిలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ కూడా మగధీరకే సొంతం. ఇక ఒక్కసారిగా చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అంతే కదా ఈ సినిమాతో కాజల్ అగర్వాల్‌కి కూడా తిరగలేని ఇమేజ్ క్రియేట్ అయింది.
ఇక ఈ సినిమాలో ఈ జంటకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అయితే మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో మరో సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూట్‌ను కూడా.. ప్రారంభించిన తర్వాత ఈ సినిమా కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటో.. ఆ మూవీ ఏదో.. ఒక సారి చూద్దాం. మగధీర తర్వాత చరణ్ హీరోగా.. కాజల్ హీరోయిన్గా తమిళ్ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో మెరుపు టైటిల్ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మూవీ లాంచింగ్ కూడా గ్రాండ్ లెవెల్ లో చేశారు. ఈ క్రమంలోనే సినిమా షూట్ అంతా చక చక పూర్తి చేసి.. రిలీజ్ చేయడం జరుగుతుందని అంత భావించారు. అయితే అసలు కారణం ఏంటో తెలియదు కానీ సినిమాను మేకర్స్ ఆపేసినట్లు సమాచారం. అయితే.. తర్వాత మళ్ళీ ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇక ఈ సినిమా ఆగిపోయిన తర్వాత కూడా చరణ్ – కాజల్ కాంబోలో నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి.