చిరంజీవితో అలా ఎన్టీఆర్‌తో ఇలా.. ఆ డైరెక్టర్ చేసిన పనికి అంతా షాక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు టాలీవుడ్ లో టాప్ హీరోస్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తారక్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. అయితే గతంలో వీరిద్దకు ఒకే డైరెక్టర్ రూపొందించిన రెండు సినిమాల‌లో న‌టించ‌గా ఆ సినిమాలు వారం గ్యాప్‌తో రిలీజ్ చేశారు. అయితే.. ఆ రెండు సినిమాలతో ఒకరికి ఇండస్ట్రియల్ హిట్.. మరొకరికి డిజాస్టర్ ఇచ్చి ఆడియన్స్‌ను షాక్ చేశాడు ఆ డైరెక్టర్. ఇంతకీ ఆ సినిమాలేంటో.. ఆ డైరెక్టర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

How Jr NTR's movie lost out to Chiranjeevi's 'Indra' in last minute

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్లలో బి.గోపాల్ ఒకరు. ఈయన గతంలో ఎన్నో సినిమాలను తెర‌కెక్కించి బ్లాక్ బాస్టర్ రికార్డులను క్రియేట్ చేశాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బి. గోపాల్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన మూవీ అల్లరి రాముడు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. నగ్మా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇకపోతే బి.గోపాల్.. తారక్ కాంబోలో వ‌స్తున్న సినిమా కివ‌డంతో ఆడియన్స్ లో మంచి అంచనాల నెలకొన్నాయి. అలా జులై 18న భారీ అంచనాల నడుమ‌ రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర డీలపడింది. తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్ సినిమాగా నిలిచింది.

B Gopal: కమర్షియల్‌ సినిమాకు చిరునామా బి.గోపాల్‌.. ఈ వారం 'వెండితెర  వేల్పులు' స్పెషల్‌ | director-b-gopal-special-venditera-velpulu

ఇక బి. గోపాల్ అదే ఏడాదిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేలను హీరోయిన్గా పెట్టి ఇంద్ర సినిమాను తెర‌కెక్కించారు. ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ అంచనాల నడుమ జులై 24న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్గా నిలవడమే కాదు.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్గా ఇమేజ్ను దక్కించుకుంది. అలా దాదాపు వారం గ్యాప్ లో బి.గోపాల్ డైరెక్షన్ లో బ‌చ్చిన‌ తారక్ అల్లరి రాముడు, చిరు ఇంద్ర సినిమాలు 2 రిలీజ్ కాగా తార‌క్ కుఅట్టర్ ఫ్లాప్ ఇచ్చిన బి. గోపాల్.. చిరంజీవికి ఇంద్రతో బ్లాక్ బస్టర్ ఇచ్చి రికార్డ్ సృష్టించాడు.