టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2కు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన కిసిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రొడ్యూసర్లపై అసహనం వ్యక్తం చేస్తూ సెటరికల్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఇక దేవి, మైత్రికి మేకర్స్ మధ్య క్లాష్ ఉన్నట్లు అందరికి క్లారిటి వచ్చేసింది. ఇక దేవి మైత్రికి దూరమైనట్లేనా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. రామ్ పోతినేని హీరోగా.. మైత్రి మూవీస్ బ్యానర్ పై కొత్త మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న నిన్న మొన్నటి వరకు క్యూస్షన్ మార్క్‌గా ఉన్న తాజాగా దానికి సమాధానం దొరికేసింది.
వివేక్ మెర్విన్ అనే ఓ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను ఈ సినిమాకు సెలెక్ట్ చేశారట. అయితే ఇది ఒక్క మ్యాటర్ కాదు. రెండు వార్తలు ఇందులో ఉన్నాయి. రామ్ పోతినేని సినిమా అంటే దీనికి దాదాపు దేవి సంగీతం అందిస్తారని అంతా భావించారు. ఎందుకంటే.. వీరిద్దరి కాంబినేషన్లో రెండు, మూడు మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఉన్నాయి. పైగా మైత్రితో సినిమా అంటే దేవికి ఛాన్స్ ఉంటుందని నిన్ను మొన్నటి వరకు గట్టి నమ్మకం ఉండేది. కానీ.. ఇప్పుడు వేరే వాళ్ళు ఆ ప్లేస్ లోకి మ్యూజిక్ డైరెక్టర్లుగా వస్తున్నారు.
అలా అని దేవి కాకుండా రామ్‌కు మరింత దగ్గరగా వ్యవహరించే వారిలో థమన్, మణిశర్మ కూడా ఉన్నారు. వారు ఎవరిని కాకుండా తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా కొత్తవాళ్లుగా ఉండాలని భావించారట. ఇప్పటికే హీరో నాని రెగ్యులర్ థమన్, దేవి లను కాకుండా కొత్తవారిని తన సినిమాల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రామ్ కూడా ఇదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తుంది. సితార, హారిక హాసిని సంస్థలకు దేవిశ్రీ ఇప్పటికీ పూర్తిగా దూరమయ్యారు. ఈ క్రమంలోనే మరోసారి మైత్రి మేకర్స్‌కు కూడా దేవి దూరమైనట్లను అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రంగంలోకి రానున్నారట.